నేడు, రేపు అనంతపురం జిల్లాలో చంద్రబాబు

Published: Friday November 23, 2018

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మారాల జలాశయానికి కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. కప్పలబండ గ్రామంలో జరిగే గ్రామసభలో పాల్గొననున్నారు. అలాగే జిల్లాలో జరుగుతున్న ఆయా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపనున్నారు. ఆ తర్వాత జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య విభేదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు.