తన భర్త అరెస్టుతో జడ్పీచైర్మన్‌పై ఆరోపణలు

Published: Friday November 23, 2018
 à°•à°¾à°³à±à°³ జడ్పీటీసీ సభ్యురాలు బర్రె శ్రీవెంకటరమణ పార్టీకీ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. నాలుగు నెలల కిందటే ఆమె జనసేన పార్టీలో చేరుతున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె కాని, ఆమె భర్తకాని ఖండించలేదు. తాజాగా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో తన భర్తను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళడం వెనుక జడ్పీ చైర్మన్‌ బాపిరాజుపై అనుమానంగా ఉందని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా ప్రకటించడం పార్టీలో చర్చకు దారితీసింది. ఇది à°’à°• సాకు మాత్రమేనని కాళ్ళ మండల టీడీపీ నాయకులు చెబుతున్నారు.
 
ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం మొదటి నుంచి బలంగానే ఉంది. కాళ్ళ మండలంలో కూడా పార్టీ పటిష్టంగా ఉంది. జడ్పీటీసీ భర్త జయరాజు, ఆక్వా ట్రేడర్‌à°—à°¾ ఉన్నారు. నల్లజర్ల ప్రాంతానికి చెందిన à°’à°• రైతుకు సుమారు రూ.6 లక్షలు బకాయి ఉండగా ఇటీవలే à°† సొమ్ము చెల్లించామని అయినప్పటికి తన భర్తను బుధవారం తెల్లవారు జామున ఆకస్మికంగా పోలీసులు నల్లజర్ల తీసుకు వెళ్ళారని వెంకటరమణ ఆరోపించారు. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీవెంకటరమణ, భర్త జయరాజులది కాళ్ళ మండలం కలవపూడి మోడీ స్వగ్రామం. జయరాజు తండ్రి గంటయ్య కుటుంబం అంతా అక్కడే ఉంటోంది. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నారు. 2014లో ఎమ్మెల్యే శివరామరాజు ఆకుటుంబాన్ని టీడీపీలోకి తీసుకువచ్చి శ్రీవెంకటరమణకు జడ్పీటీసీ పదవి ఇప్పించారు.
 
సుమారు ఐదు వేల ఓట్లుకుపైగా మెజారిటీతో ఆమె గెలుపొందింది. తరువాత à°ˆ దంపతులు భీమవరంలో కాపురం ఉన్నారు. నాలుగు నెలల కిందట శ్రీవెంకటరమణ కుటుంబంతో సహా నర్సాపురం వెళ్ళిపోయారు. à°† సందర్భంలోనే ఆమె జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో à°ˆ ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయట పడటంతో దానికి రాజకీయ రంగు అంటించారని అధికార టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. à°ˆ వ్యవహారంలో జడ్పీచైర్మన్‌పై అనుమానం ఉందని అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు వెంకట రమణ ప్రకటించారు. మరోవైపు జయరాజు తండ్రి కుటుంబం మాత్రం ప్రస్తుతం తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు.