మోదీని ఎందుకు విమర్శించరు జగన్, పవన్‌లకు లోకేష్ సవాల్
Published: Saturday November 24, 2018

గుంటూరు: రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 68 ఏళ్ల వయస్సులో 24ఏళ్ల కుర్రాడిలా నిరంతరం పనిచేస్తున్నా వైసీపీ, జనసేనలు విమర్శించటం విడ్డూరంగా ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. గురజాల ఆర్డీవోకార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో మంత్రి ప్రసంగిస్తూ మోదీని జగన్, పవన్‌లు ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు చేయాలని మోదీని జగన్, పవన్‌లు అడిగే ధైర్యం చేయటం లేదన్నారు. ఇకపై జగన్‌మోహన్‌రెడ్డి పేరును జగన్‌మోదీరెడ్డిగా మారిస్తే సరిపోతుందన్నారు.
రాష్ట్రంలో పేదలెవరూ ఆకలిగా ఉంటే చూడని ఎన్టీఆర్ వారసుడిగా చంద్రబాబు రూ.5తో భోజనం పెట్టే చంద్రన్న క్యాంటిన్‌ను పెట్టటం జరిగిందన్నారు. పవన్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో అర్థంకావటంలేదన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుకు ఏనాడూ చెడ్డ పేరు తెచ్చే పనిమాత్రం చేయనని తెలిపారు. దొంగ పుత్రుడు, దత్తపుత్రులైన జగన్, పవన్‌లను 2019 ఎన్నికల్లో ఓడించాలని పిలుపు నిచ్చారు.
మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి మార్గనిర్థే శకుడిగా పనిచేస్తున్న లోకేష్‌ను రాష్ట్ర ప్రజలు ఆదరిం చాలన్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో గురజాలను రెవెన్యూ డివిజన్‌గా చేయటం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో పల్నాడును జిల్లా కేంద్రంగా తయారు చేసే ప్రతిపాదన ఉందన్నారు.

Share this on your social network: