సొంతంగానే పోటీ చేస్తామనడం పచ్చి మోసం

వైసీపీ, జనసేన అధ్యక్షులు జగన్, పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామనడం పచ్చి మోసం. విషం పూసిన కత్తితో సమానం. ఎన్నికల ముందు గానీ, తర్వాతగానీ బీజేపీతో పోవాలా.. కాంగ్రెస్‌తో కలవాలా.. అనేది వారిద్దరూ నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైంది’ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రుణమాఫీ, పెట్రో ధరల తగ్గింపు వంటి వాటికి విముఖంగా ఉన్న పార్టీతో పోతే వారే నష్టపోతారని స్పష్టం చేశారు. అని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు రెండు జిల్లాల నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ ముఖ్యులతో సమీక్షించారు. మరోవైపు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పీసీసీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులతో కలసి సంబరాలు నిర్వహించారు. రాష్ట్రానికి కీడు చేసే బీజేపీతో వెళ్తారో.. మేలు చేసే కాంగ్రె్‌సతో ఉంటారో తేల్చుకోవాలని ప్రతిపక్షాలను కోరుతున్నానని ఆయన అన్నారు.

Share this on your social network: