సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాం...పాదయాత్రలో జగన్‌ హామీ

Published: Sunday December 02, 2018
తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని వైసీపీ అధి నేత జగన్‌ ప్రకటించారు. సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలంటూ పాదయాత్రలో తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాలకు జగన్‌ ఈమేరకు హామీ ఇచ్చా రు. 2రోజుల విరామం తర్వాత జగన్‌ పాదయాత్ర శనివారం పాలకొండ మండలం అన్నవరం జంక్షన్‌ వద్ద ప్రారంభమై... గోపాలపురం, మంగళాపురం జంక్షన్‌ మీదుగా రేగిడి మండలంలోకి ప్రవేశించింది. ఉంగరాడమెట్ట వద్ద సాయంత్రం 5గంటలకు ముగిసింది. సుమారు 8కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను వింటూ... సెల్ఫీ లు దిగుతూ, అప్యాయ పలకరింపులతో ముందుకు సాగారు.
 
నాగావళి నదికి కరకట్టలు నిర్మించాలని అన్నవరం, గోపాలప ురం ప్రజలు జగన్‌కు విన్నవించారు. కరకట్టలు లేక వరదలకు పంటలు నష్టపోతున్నామని చెప్పారు. తమ కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని పద్మశాలీ సంఘం నాయకులు కోరా రు. గోపాలపురం వద్ద ప్రవాసాంధ్రుల పార్టీ వైద్య విభాగం ప్రతినిధులు జగన్‌ను కలిశారు. చెరకుకు మద్ద తు ధర కల్పించాలని, రుణమాఫీ చేయాలని సంకిలి షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద రైతు సంఘం నాయకులు జగన్‌ను కోరారు. అయితే రుణమాఫీ చేయలేమని, రైతు భరోసా కార్యక్రమం à°•à°¿à°‚à°¦ రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, చెరకు రైతులకు మద్దతు ధర కల్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.