గ్యాంగ్‌స్టర్ దూబే చావుకు కారణం ఇదే..

Published: Monday July 20, 2020

కరడుగట్టిన నేరగాడు, యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే పోర్టమార్టం నివేదికలో తాజాగా à°®à°°à°¿à°¨à±à°¨à°¿ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుల్లెట్ గాయాల వల్ల తీవ్ర రక్తస్రావంతో పాటు అతడు ఒక్కసారిగా షాక్‌à°•à°¿ గురై ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు.  కొద్దిరోజుల క్రితం కాన్పూర్‌లో వికాస్ దూబే ముఠా ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకోగా.. సరిగ్గా వారం రోజులకు దూబేను అరెస్ట్ చేసిన పోలీసులు అదే కాన్పూర్‌లో అతడిని ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని ఉజ్జయిని నుంచి అతడిని తీసుకొస్తున్న కారు బోల్తా పడడంతో పోలీసుల ఆయుధం లాక్కుని ‘‘తప్పించుకోజూశాడనీ’’.. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు అతడిపై కాల్పులు జరిపారని యూపీ పోలీసులు తెలిపారు. కాగా దూబే శరీరంలో నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయని కాన్పూర్ వైద్యులు వెల్లడించారు. దూబే రాజకీయ పెద్దల రహస్యాలు బహిర్గతం కాకుండా ‘‘బూటకపు ఎన్‌కౌంటర్లో’’ అతడిని చంపేశారంటూ విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టింది. విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌కే అగర్వాల్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రెండు నెలల్లోగా à°ˆ కేసుపై తుది నివేదిక సమర్పించనుంది.