ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం.

Published: Friday June 01, 2018

మహారాష్ట్రలోని యావత్మాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ని ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున ఓ కారు, ట్రక్కు ఢీకొనడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి కారు, లారీ ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా బుధవారం యావత్మాల్ సమీపంలోని బెలోనా గ్రామంలో ఇదే తరహాలో ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్ వెళ్తున్న ఎస్టీ బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొని బోల్తాపడడంతో... ఇద్దరు మృతిచెందగా, 18 మందికి గాయపడ్డారు. ఇది జరిగిన రెండ్రోజుల్లోనే ఇక్కడ మరో విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.