వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య

Published: Sunday November 25, 2018
ఏలూరు: ఏకారణం తెలియదు గాని ఒక వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరులోని తంగెళ్ళమూడి ప్రాంతంలో ఉంటున్న గెడ్డం వెంకటేశ్వరరావుకు ఏడాదిన్నర క్రితం అయ్యప్పరాజుగూడెంకు చెందిన మానసతో వివాహం అయింది. వెంకటేశ్వరరావు సెంట్రింగ్‌ పనులకు వెళుతుంటాడు. శనివారం రాత్రి వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చేసరికి మానస తలుపులేసుకుని లోపల ఉరి వేసుకుని కన్పించింది.
 
ఇరుగు పొరుగు వారి సహకారంతో తలుపులు పగులగొట్టి ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రాత్రి 10.30 నిమిషాలకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.