విద్యార్థులకు సీఎం చంద్రబాబు పిలుపు

Published: Wednesday December 05, 2018
‘‘విద్యార్థుల మేధస్సు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరం. ప్రభుత్వం వల్ల మీరు, మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందారన్న దానిపై ఆలోచన, అవగాహన కలిగి ఉండండి. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకోండి. ప్రభుత్వం లోపలి విషయాలను శోధించండి. ప్రభుత్వానికి ఆదాయం à°Žà°‚à°¤ వస్తుంది, ఎలా వస్తుంది అన్నది ఆలోచన చేయండి’’ అంటూ విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. à°•à°¡à°ª జిల్లా యోగివేమన యూనివర్సిటీలో మంగళవారం జరిగిన నాలుగో జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
 
‘‘à°’à°• నాయకుడికి మంచి బుద్ధి, జ్ఞానం ఉంటే à°† ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కరువు జిల్లా అనంతపురానికి చెందిన సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సంవత్సరానికి రూ.500 కోట్లు సంపాదిస్తున్నారు. తమిళనాడుకు చెందిన సుందర పిచాయ్‌ గూగుల్‌ సంస్థ సీఈవోగా పనిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు వృద్ధిలోకి రావాలి’’ అని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రతి విద్యార్థీ తెలుసుకోవాలన్నారు. ‘‘à°ˆ సీఎంకు ఏమీ తెలియదు అనుకునే వారు ఉన్నారు. హైదరాబాద్‌లో ట్రిపుల్‌ఐటీ à°† రోజుల్లో పెడితే నేడు వాటి బ్రాంచ్‌లు రాష్ట్రంలో పెట్టారు. ఇదంతా మంచి ఆలోచన ఫలితమే. à°’à°• మంచి ఆలోచన ఇస్తే మరింత అభివృద్ధి దిశగా నడిచే అవకాశం ఉంటుంది. విజన్‌ లేకపోతే ఏమీ సాధించలేం. ఇన్నోవేషన్‌ అన్నది నిరంతర ప్రక్రియగా విద్యార్థుల్లో ఉండాలి. విద్యార్థులు రెండు నిమిషాలు ఆలోచన చేస్తే à°’à°• కొత్త విషయం వినూత్నంగా వస్తుంది’’ అని అన్నారు.
 
శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అనుసంధానం చేస్తూ ఇన్నోవేషన్‌ వ్యాలీ అభివృద్ధి చేస్తామన్నారు. à°ˆ వ్యాలీ కోసం విశాఖలో 50 ఎకరాలు కేటాయించామని చెప్పారు. పుట్టుకతో కాదు.. ఆచరణతోనే విలువలు వస్తాయన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాటలు సదా శిరోధార్యమన్నారు. వయాడక్ట్‌ మంత్రాన్ని జపించడం నేటి విద్యార్థికి అవసరమని సీఎం తెలిపారు. తితలీ తుఫాను ఉత్తరాంధ్రను సర్వనాశనం చేసినా సాంకేతికతతో వారం రోజుల్లో సాధారణ పరిస్థితులకు తీసుకువచ్చామని సీఎం గుర్తుచేశారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుందన్న ఆలోచనతోనే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు చేపట్టామన్నారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేసేలా గట్టిగా ఆశీర్వదించాలని కోరారు. ‘‘మీ జీవితాలు మారాలన్నా, మీరు బాగుపడాలన్నా, నదుల అనుసంధానం జరగాలన్నా వయాడక్ట్‌తోనే సాధ్యం’’ అన్నారు.