ఐక్య పోరాటానికి అందరూ కలిసి రావాలి

Published: Sunday December 09, 2018

 à°•à°¾à°·à°¾à°¯à°‚, ఖద్దరు పార్టీ నేతలు 2004 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారి హక్కుల కాలరాశారని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఐక్య కార్యచరణ సమితి(జేఏసీ) పూర్వ సెక్రటరీ జనరల్‌ ఐ.వెంకటేశ్వరరావు(ఐవీ) విమర్శించారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ ఏపీలోని 13 జిల్లాల సీపీఎస్‌ ఉద్యోగులు శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ర్యాలీ చేశారు. ఆయా జిల్లాల నుంచి 3 వేల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆనందభారతి మునిసిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమరభేరి సదస్సులో మాట్లాడుతూ, ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. సీపీఎస్‌ రద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం టక్కర్‌ కమిటీ వేసింది. à°ˆ కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు క్రియాశీలకంగా ఉన్నారు. సీనియర్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లం కూడా ఉన్నారు. సీపీఎస్‌ రద్దు విషయాన్ని మరిచిపోవాలని స్వయంగా మంత్రి యనమల మాతో అన్నారు. అజేయ కల్లం à°’à°• అడుగు ముందుకు వేసి సరళీకృత విధానాలతోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. à°† రోజే సీపీఎస్‌ రద్దుకు ఏ పార్టీ ముందుకు వస్తుందో à°† పార్టీకే ఉద్యోగుల మద్దతు ఉండాలని జేఏసీ రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేసింది. సీపీఎస్‌ రద్దు కోసం అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రావల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వెంకటేశ్వరరావు అన్నారు. సీపీఎస్‌ ఉద్యోగ సంఘం ఏపీ అధ్యక్షుడు గొడుగు ప్రతాప్‌ మాట్లాడుతూ, ‘‘జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు, అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు ఐక్య పోరాటానికి ముందుకు రావాలి. వచ్చే ఏడాది జనవరి 8 లోపు సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వంప్రకటించాలి. లేదంటే సమ్మె తప్పదు’’ అన్నారు.