భారీ లోటును పూడ్చేందుకు ఆర్థికశాఖ ప్రణాళిక

Published: Wednesday December 12, 2018
ఇప్పటికే ఆర్థికలోటులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... à°ˆ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి మరింత లోటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. à°ˆ నాలుగు నెలల్లో రాష్ట్రానికి వివిధ మార్గాల ద్వారా రూ.54,600 కోట్ల ఆదాయం వస్తుందని, ఖర్చులు రూ.70,200 కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రూ.15,600 కోట్ల భారీ లోటును పూడ్చడంపై దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి అనుకున్నస్థాయిలో సాయం అందకపోయినప్పటికీ... మనకి అందుబాటులో ఉన్న వనరులతోనే రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో ముఖ్యంగా ‘ఆఫ్‌బడ్జెట్‌ బారోయింగ్‌’ విధానంలో రూ.12,000 కోట్లను వివిధ శాఖలకు రుణాలుగా ఇప్పించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. రూ.2000 కోట్లను బ్యాంకు ఖాతాల నుంచి నిధుల బదిలీ ద్వారా, భూక్రమబద్ధీకరణ పథకం, ఇతర మార్గాల ద్వారా రూ.1000 కోట్లు సమీకరించాలని చూస్తున్నారు. దీంతో ఖర్చులు, ఆదాయానికి మధ్య వ్యత్యాసం రూ.600 కోట్లకు తగ్గుతుంది.
 
 
ఆదాయం ఇలా..: à°µà°šà±à°šà±‡ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర సొంత ఆదాయం రూ.21,048 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా à°•à°¿à°‚à°¦ రూ.15,331 కోట్లు, కేంద్రప్రాయోజిత పథకాలు, గ్రాంట్ల రూపంలో రూ.11,794 కోట్లు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. à°ˆ మూడు ఆదాయవనరుల రూపంలో రూ.48,174 కోట్లు రానున్నాయని à°† ప్రణాళికలో పేర్కొన్నారు. మార్కెట్‌ బారోయింగ్స్‌, ఈఏపీలు, నాబార్డు ద్వారా రూ.5500 కోట్లు, వేజ్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా రూ.1000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మొత్తం ఆదాయం రూ.54,600 కోట్లకు చేరుకుంటుంది.