152 ఏళ్ల తర్వాత నేడు ఆకాశంలో అద్భుతం

Published: Wednesday January 31, 2018

శ్వేతవర్ణంలో వెలుగులు చిందే చంద్రుడంటే అందరికీ ఇష్టమే. ప్రతీ రోజు సరికొత్తగా పలుకరించే అందాల చందమామ అంటే చిన్నారులకు ఇంకా క్రేజ్. అయితే ఇప్పుడు చిన్నా, పెద్దా అందరి చూపును తన వైపు తిప్పేసుకోడానికి చందమామ రెడీ అయిపోయాడు. à°’à°•à°Ÿà°¿ కాదు రెండు కాదు ఆకాశంలో మరో రెండు అద్భుతాలను తోడు తెచ్చుకుని మరీ బ్లూ బ్లడ్ మూన్‌à°—à°¾ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. ప్రపంచం మొత్తం ఎదురు చూసే సమ్‌థింగ్ స్పెషల్‌à°—à°¾ రానున్నాడు.

 

కొన్ని సందేహాలు, మరికొన్ని కుతూహలాల మధ్య ఈరోజు శ్వేతవర్ణంలో వెలుగులు చిందే చంద్రుడు నీలంరంగులో దర్శనం ఇవ్వనున్నాడు. అదే రోజు ఆకాశంలో మరో రెండు అద్భుతాలను చూసే అరుదైన అవకాశం కూడా ఉండటంతో ఇప్పటికే ఎంతో మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బ్లూమూన్‌తో పాటు చంద్రగ్రహణం, సూపర్ మూన్ ఒకే రోజు రానుండటంతో ప్రతీఒక్కరి చూపు బుధవారం రోజు కనిపించే చంద్రుడి పైనే ఉంది. 1886లో కనిపించిన à°ˆ అద్భుతం దాదాపు 152ఏళ్ల తర్వాత మళ్లీ ఆవిష్కృతమవడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా భావిస్తున్నారు. మామూలుగా చంద్రగ్రహణం రోజున మార్పుల వల్ల తెల్లగా కనిపించే చంద్రుడు క్రమేణా రంగులు మారతాడు.

 

గ్రహణం రోజున సాధారణంగా ఎర్రగా రక్తపు రంగులోకి మారతాడు. దీన్ని బ్లడ్ మూన్ అని అంటారు. ప్రతీ రెండేళ్ల 8 నెలలకు ఒకసారి చంద్రుడు బ్లూ మూన్‌à°—à°¾ మారతాడు. అయితే జనవరి 31à°¨ ఏర్పడే చంద్రగ్రహణంలో మాత్రం బ్లూమూన్‌à°—à°¾ దర్శనం ఇవ్వడంతో పాటు చంద్రగ్రహణం తోడవడం ఇప్పుడు టాక్‌ఆఫ్‌à°¦ వరల్డ్ అయ్యింది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం ఈరోజు(జనవరి31) సాయంత్రం 6:20 గంటలకు మొదలై 7.37à°—à°‚à°Ÿà°² వరకు ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యమీదకు వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే.

 

à°ˆ సందర్భంగా చంద్రుడిపై పడే కిరణాలు భిన్నరంగుల్లో మారి నీలం రంగులో దర్శనం ఇస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సూపర్ మూన్ రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. à°ˆ సందర్భంగా చంద్రుడు 14శాతం పెద్దగా, 30శాతం కాంతివంతంగా కనిపిస్తాతాడు. దీనివల్ల చంద్రగ్రహణం, బ్లూమూన్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పశ్చిమకోస్తా ప్రాంతాల్లో నివసించే వారికి à°ˆ అద్భుతాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం కలుగుతుంది. అయితే à°ˆ చంద్రగ్రహణాన్ని చూడకూడదని జ్యోతిష్యులు చెబుతుంటే నాన్‌సెన్స్ అని కొట్టిపడేసే వాళ్లు ఉన్నారు. శాస్త్రమా, సాంకేతికమా అని ప్రశ్నించే వాళ్లు ఉన్నారు. ఏదేమైనా 152ఏళ్ల తర్వాత కనిపించే అరుదైన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కోసం ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తోంది. ఆకాశంలో అద్భుతాన్ని వీక్షించడంతో పాటు మధురానుభూతుల మధ్య వెన్నెలరేయిని ఆశ్వాదించడానికి రెడీ అవుతోంది.