మోదీ డైరెక్షన్‌లో జగన్‌..

Published: Wednesday January 09, 2019
దేశ ఆర్థిక రక్షణ వ్యవస్థలకు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, రాజ్యాంగ వ్యవస్థలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నరేంద్రమోదీ అని పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాల పాటి శ్రీధర్‌ ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులను కాపాడటం కోసం తెలుగుదేశం ఏర్పడిందే కానీ ఏదో à°’à°• పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందనేది అవాస్తవమన్నారు. మోదీ నియంతగా మారి విభజన చట్టం హామీలను, పార్లమెంట్‌ హామీలను అమలు చేయకుండా రాష్ర్టానికి ద్రోహం చేస్తుంటే 5 కోట్ల ఆంధ్రులు తిరగబడటం వెన్నుపోటు ఎలా అవుతుందన్నారు.
 
రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రధాని మోదీ డైరెక్షన్‌లోనే నిందల పుస్తకం, తిట్ల దండకాలు అందుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీధర్‌ పేర్కొ న్నారు. à°† పుస్తకంలో నీటి ప్రాజెక్టులు ఖర్చు చేసింది రూ.62 వేల కోట్లని ఒకచోట రాసి, అదే పుస్తకంలో మరోచోట ప్రాజెక్టులో రూ. లక్ష కోట్లు అని రాయటం పచ్చి అబద్ధం కాదా అని ప్రశ్నించారు. ఇంటర్నేషనల్‌ ఇండియా నివేదిక ప్రకారం తక్కువ అవినీతి ఉన్న మూడు రాష్ట్రాలలో ఏపీ à°’à°•à°Ÿà°¿à°—à°¾ ఉన్నదనేని వాస్తవం కాదా అని ఆయన అన్నారు. ఎక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రెండవ స్థానంలో ఉందదన్నారు. మితిమీరిన అవినీతిలో మునిగిఉన్న కేసీఆర్‌, మోదీలకు వైసీపీ ఏజెంట్‌à°—à°¾ మారి అభివృద్ధిని అడ్డుకో వాలని చంద్రబాబుపై నిందలు వేయటం మంచి పద్థతికాదన్నారు. ప్రజలే వారికి బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే శ్రీధర్‌ హెచ్చరించారు.