రికార్డ్‌ కొట్టిన విజయవాడ రైల్వేస్టేషన్‌

Published: Thursday February 01, 2018

విద్యుత్‌ ఆదా విషయంలో విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు సరికొత్త రికార్డ్‌ సాధించారు. ముఖ్యంగా వందకు వంద శాతం విద్యుత్‌ను ఆదా చేశారు. రైల్వేస్టేషన్‌ బయట ప్రాంతంలో పాటు, à°’à°•à°Ÿà°¿ నుంచి 10 ప్లాట్‌ ఫారాల వరకు మొత్తం 2,716 లైట్లు ఉన్నాయి. వీటి స్ధానంలో 2574 ఎల్‌ఈడీ లైట్లను వేశారు. 676 ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఫ్యాన్‌లు, 13 నాన్‌ స్టార్‌ ఏసీ యూనిట్‌à°² స్థానంలో ఇన్వర్టర్‌ టైపు ఏసీ యూనిట్‌లను బిగించటం వల్ల 4,19,867 యూనిట్‌లు పొదుపు అవ్వడంతో పాటు, రూ 30,65,028 ఆదా అయినట్టు తెలిపారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో కూడా ఇదే పద్ధతిలో 51,158 యూనిట్లు ఆదా చేసి రూ. 3,73,456 ఆదా చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో అన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్‌లలో ఇదే పద్ధతి అవలంభించనున్నట్టు అధికారులు తెలిపారు.