విశాఖలో భోగిమంటతో వినూత్న నిరసన

Published: Saturday January 12, 2019

 à°µà°¿à°¶à°¾à°– రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం వైఖరిని ఆక్షేపిస్తూ నాన్‌ పొలిటికల్‌ జేఏసీ శుక్రవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేసింది. వాల్తేర్‌ డీఆర్‌à°Žà°‚ కార్యాలయం ఎదురుగా భోగి మంట వేసి.. జోన్‌కు సంబంధించి విభజన చట్టం 13à°µ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల ప్రతులను దహనం చేసింది. తెలుగు ప్రజల గుండె మంట ప్రధాని మోదీకి తగిలేలా à°ˆ భోగి మంటలు వేశామని జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. à°ˆ సందర్భంగా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక.. రైల్వే జోన్‌ ఇస్తారని నాలుగున్నరేళ్లుగా ఎదురుచూశామన్నారు. à°ˆ నెల 9à°µ తేదీతో పార్లమెంట్‌ సమావేశాలు ముగించడంతో జోన్‌ ప్రస్తావన మరుగున పడినట్లయిందన్నారు. జోన్‌ తీసుకువస్తామని, లేకపోతే తమ ఓటమిగా భావించాలని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారని, అయినా ఫలితం లేకపోయిందని ఆక్షేపించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోతే à°† కాగితాలకు విలువ లేనందున భోగి మంటల్లో వేశామని మంత్రి చెప్పారు. విశాఖలో పాదయాత్ర చేసిన విపక్ష నేత జగన్‌, కనీసం జోన్‌ గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.