ఏపీ బడ్జెట్‌ - తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ

Published: Thursday February 01, 2018

అమరావతి: à°¬à°¡à±à°œà±†à°Ÿà±‌లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తకుండా ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిన జైట్లీ పలు విద్యాలయాలకు నిధులు కేటాయించి కొంత ఊరటనిచ్చారు. 2018-19 సార్వత్రిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జైట్లీ...ఏపీ పంపిన అనేక ప్రతిపాదనలు బడ్జెట్‌లో పక్కనపెట్టేశారు. ఏపీకి సంబంధించి మెగా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించలేదు. అమరావతి నిర్మాణానికి సంబంధించి, ఏపీకి రావాల్సిన విభజన రావాల్సిన హక్కులు, హామీలపై ఎలాంటి కేటాయింపులు జరుగలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాలతో పాటు విశాఖపోర్టుకు నిధులు కేటాయించినట్లు జైట్లీ ప్రకటించారు.

 

ఏపీ కేటాయింపులు ఇవే:

  • ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు

  • ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు

  • ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు

  • ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు

  • ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు

  • ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు

  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు

  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు