పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న ఎన్‌ఆర్‌ఐ ట్రస్ట్‌ చైర్మన్‌

Published: Wednesday January 23, 2019
à°•à°¡à°ª: à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ à°—à°¤ కొంతకాలంగా ఎన్‌ఆర్‌ఐ ట్రస్ట్‌ ద్వారా విద్యాభివృద్ధికి, క్రీడల ప్రోత్సాహానికి, ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలలో ఆర్థిక చేయూతనివ్వడం వల్ల కొంత ఆత్మసంతృప్తి లభిస్తున్నప్పటికి ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరుగుతుందని ఎన్‌ఆర్‌ఐ ట్రస్ట్‌ చైర్మన్‌, ఒలంపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తోటకృష్ణ అన్నారు. నగరంలోని ఎన్‌ఆర్‌ఐ ట్రస్టు కార్యాలయంలో మంగళవారం క్రీడాసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో రాజకీయ ప్రవేశంపై సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధికశాతం మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న పలు పార్టీలు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు.
 
 
జిల్లా వ్యాప్తంగా గల తన అభిమానులు, కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు ఏ పార్టీలో చేరనున్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏదైనా పార్టీ నుంచి పోటీ చేయాలా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలా అనే అంశంపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. జనసేన రాష్ట్ర నాయకుల ఆహ్వానం మేరకు సంప్రదింపులు కూడా పూర్తి కావడం జరిగిందన్నారు. ప్రజలు, అభిమానుల ఆశీస్సులతో త్వరలో జరగబోవు ఎన్నికల్లో పోటీ బరిలో ఉంటానని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.