కేంద్రంపై పోరాటం చెయ్యాలి : చంద్రబాబు

Published: Friday February 02, 2018

అమరావతి: à°®à±à°–్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. à°ˆ సమావేశంలో సీఎం నేతలకు పలు సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై మనం సైలెంట్‌à°—à°¾ ఉంటే ప్రమాదమని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై, కేంద్రం తీరుపై పోరాటం కొనసాగిద్దామని నేతలకు చంద్రబాబు సూచించారు. అలా అని అతిగా కూడా స్పందించవద్దని, జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. రేపు (శనివారం) ఎంపీలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నారు. మిత్రధర్మాన్ని బ్యాలెన్స్‌ చేసుకుని పోరాటం చేద్దామని ఆయన సూచించారు.

 

వచ్చే మూడు నెలల్లో 175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దళితతేజం తెలుగుదేశం పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని సీఎం నేతలకు హితబోధ చేశారు. దళితుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని ప్రోత్సహించాలని, ప్రజల సెంటిమెంట్ ఎలా ఉందో గ్రహించి ముందుకెళ్లాలని, త్వరలో బీసీలు, మైనార్టీల సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలు, మంత్రులతో అన్నారు.