యడ్లపల్లి కృషికి గుర్తింపుగా అవార్డు ప్రకటన

Published: Saturday January 26, 2019
రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరావును ‘పద్మశ్రీ’ అవార్డు వరించింది. ప్రకృతి, సేంద్రియ సేద్యం విస్తృతమయ్యేలా ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం à°ˆ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడుకు చెందిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు 15 ఏళ్ల నుంచి రైతునేస్తం, ప్రకృతినేస్తం, పశునేస్తం పేరుతో మాస పత్రికలు నడుపుతున్నారు. ఏటా తెలుగు రాష్ర్టాల్లో వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో మెరుగైన సేవలందించిన శాస్త్రవేత్తలు, అధికారులు, ఉద్యోగులు, పాత్రికేయులకు రైతునేస్తం అవార్డులను ఐ.వి.సుబ్బారావు పేరుతో అందజేస్తుంటారు.
 
వ్యవసాయరంగంలో ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయోత్పత్తుల నాణ్యతను మెరుగుపర్చి విదేశాలకు ఎగుమతులు చేసేవిధంగా రైతులకు 15 ఏళ్ల నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌, శిక్షణ కోసం తరగతులు నిర్వహించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రైతునేస్తం ఫౌండేషన్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. à°ˆ నేపథ్యంలో ‘పద్మశ్రీ’à°•à°¿ ఎంపిక చేసినట్లు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ శుక్రవారం రాత్రి ఫోన్‌ద్వారా యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు తెలిపింది. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఎంపీలు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, డాక్టర్‌ యలమంచిలి శివాజీ, మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు యడ్లపల్లిని అభినందించారు.