2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుంది

Published: Wednesday January 30, 2019
అమరావతి: 2029 నాటికి ఏపీ నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అవతరిస్తుందని గవర్నర్‌ నరసింహన్ చెప్పారు. టెక్నాలజీ సాయంతో సేవల్ని ప్రజలకు చేరువ చేస్తున్నామని, రాబోయే ఐదేళ్లకు సంపృత్త స్థాయి విజన్‌ రూపొందించామని ఆయన తెలిపారు. 90శాతం రాయితీతో పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు గిన్నిస్‌ అవార్డు వచ్చిందని, రాష్ట్రానికి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని గవర్నర్‌ విమర్శించారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఫించన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి రూ. 2 వేలు ఇస్తామని ఆయన చెప్పారు. 11 బీసీల కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 8 బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చనున్నామని నరసింహన్ వివరించారు.
 
‘‘రూరల్, అర్బన్ హౌసింగ్ స్కీమ్ అమలు చేస్తున్నాం. పసుపు-కుంకుమ à°•à°¿à°‚à°¦ డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తున్నాం, రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం. త్వరలోనే రెండు విడతల్లో రుణమాఫీకి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తయారుచేస్తున్నాం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. నదుల అనుసంధానం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం’’ అని గవర్నర్‌ చెప్పారు.