నేడు నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరు

Published: Friday February 01, 2019
నవ్యాంధ్రకు కేంద్రంచేసిన అన్యాయానికి నిరసనగా 11à°µ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో తలపెట్టిన ధర్మపోరాట దీక్షను భారీ స్థాయిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. గురువారమిక్కడ జరిగిన à°† పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో à°ˆ దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఢిల్లీ దీక్షలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొనాలి. ఎవరి ఖర్చులతో వారు ఢిల్లీ రావాలి. మొత్తం రాష్ట్రమంతటా నిరసన వాతావరణం కల్పించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తున్న సంస్థలు, సంఘాలు, ఉద్యమకారులను కూడా ఢిల్లీ తీసుకెళ్లి.. భాగస్వామ్యం కల్పించాలి. అవసరమైతే రాష్ట్రం నుంచి ఢిల్లీకి రెండు ప్రత్యేక రైళ్లు వేసి భావ సారూప్యం ఉన్న వారిని తీసుకెళ్లాలి. ఢిల్లీ వేదికగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నినదించాలి’ అని నిశ్చయించారు.
 
ప్రత్యేక రైళ్ళ లభ్యత చూసి ఒకట్రెండు రోజుల్లో à°ˆ కార్యక్రమం ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. 13à°µ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు పెడుతున్నారు. ఈలోపు రాష్ట్రంపై కేంద్రం వైఖరి ఏమిటో తేటతెల్లమవుతుంది. మనకేదో ఇస్తారన్న ఆశలు లేవు. అయినా కొంత వ్యవధి ఇచ్చేందుకు 11à°¨ దీక్ష జరపాలనుకున్నాం. అలాగే మనకు జరిగిన అన్యాయంపై ప్రజల్లో ఆగ్రహం రగిలిస్తూనే ఉండాలి. అప్పటివరకూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలు జరిపితే బాగుంటుంది’ అని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రాల్లో ఎవరికి వారుగా పోటీ చేస్తారని, జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా à°’à°• కూటమిలో భాగస్వామిగా ఉంటామని తెలిపారు. దేశంలో రెండే ఫ్రంట్లు ఉన్నాయని.. à°’à°•à°Ÿà°¿ బీజేపీ అనుకూలం.. రెండోది దానికి వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో బీజేపీ అనుకూల ఫ్రంట్‌ను మోస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..
 
‘రేపు(శుక్రవారం) మనమంతా నల్లబ్యాడ్జీలతో శాసనసభకు, మండలికి హాజరుకావాలి. ప్రత్యేకహోదా సాధన సమితి, ఇతర సంఘాలు బంద్‌కు పిలుపిచ్చిన నేపఽథ్యంలో కేంద్రం చేసిన ద్రోహానికి ర్యాలీలతో నిరసన చేపట్టాలి. రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. పార్లమెంటు సమావేశాలూ మొదలయ్యాయి. ఇది కీలక సమయం. ప్రజాప్రతినిధులపై పెద్ద బాధ్యత ఉంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సభ సాక్షిగా 1à°¨ పునర్విభజన చట్టం అమలుపై చర్చ జరుపుతాం. ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. 5à°¨ రైతుల సమస్యలపై చర్చ ఉంటుంది. తర్వాత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెడతాం. 6à°¨ గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తాం. నాడు-నేడు-రేపుపై చర్చ ఉంటుంది. తర్వాత రోజు నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చిస్తాం.’