ఏపీకి అన్యాయం జరిగింది: చంద్రబాబు

Published: Tuesday February 06, 2018

అమరావతి: à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚టు సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ అన్యాయం చేశారో అక్కడే న్యాయం జరగాలని, పార్లమెంటు సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలని ఆయన అన్నారు. అప్పుడున్న పార్టీలే ఇప్పుడు పార్లమెంటులో ఉన్నాయని, ఏపీకి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని చంద్రబాబు అన్నారు. మూడున్నరేళ్లలో ఏపీకి చేసింది కొంతే, చేయాల్సింది చాలా ఉందని, ప్రజలు సంతృప్తి చెందేలా చూడాల్సింది కేంద్రమే ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

చేస్తాం, చూస్తామంటే సంతృప్తి కలుగదు, ఆ స్థాయి దాటిపోయిందని, హామీలు కాదు, చేతలు కావాలి, స్పష్టమైన కార్యాచరణ కావాలని చంద్రబాబు అన్నారు. సభ్యులందరూ సభకు హాజరుకావాలని, నిరసనల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో ప్రతిబింబించాలని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యమని, రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబు.. ఎంపీలకు సూచించారు.

రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని సీఎం అన్నారు. హక్కుగా ప్రజల తరపున అడుగుతున్నామని, డిమాండ్‌ను వినిపిస్తున్నామని, మిత్రపక్ష ధర్మంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కేంద్రం దృష్టికి తీసుకెళ్దామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల అసంతృప్తిని తెలియజేసే అన్నిమార్గాలు అనుసరించి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడండని ఎంపీలతో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.