పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం తప్పదు : భారత ఆర్మీ వైస్‌ చీఫ్‌

Published: Tuesday February 06, 2018

న్యూఢిల్లీ:  à°¸à°°à°¿‘హద్దు’మీరుతున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం తప్పదని భారత ఆర్మీ వైస్‌ చీఫ్‌ శరత్‌ చంద్ర ఘాటుగా హెచ్చరించారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాల్లో పాక్‌ జరిపిన కాల్పులకు à°“ సైనికాధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. à°ˆ నేపథ్యంలో ఆర్మీ వైస్‌ చీఫ్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పాక్‌ ఆర్మీ అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. ఇక మా చేతలే మాట్లాడతాయి అని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఒక్కరికీ భారత ఆర్మీ శౌర్యప్రతాపాలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. కాగా.. తమ సైన్యం జరుపుతున్న దాడులకు ఏ క్షణమైనా భారత్‌ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం ఆగమేఘాల మీద చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ) పరిసరాల్లో గస్తీని ముమ్మరం చేసింది.