విశాఖ రైల్వే జోన్‌కూ ఎగనామం

Published: Tuesday February 26, 2019
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి అడుగుపెట్టే ముందు.. ఐదేళ్ల క్రితం విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలుచేస్తామన్న వాగ్దానాన్ని ప్రధాని మోదీ నెరవేర్చాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. మోదీ మార్చి 1à°¨ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో à°—à°¡à°šà°¿à°¨ ఐదేళ్లుగా ఎన్‌డీఎ ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కేవీపీ ప్రధానికి సోమవారం లేఖ రాశారు. ‘14à°µ ఆర్థిక సంఘం వద్దందన్న సాకుతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మీరు (మోదీ) పక్కనపెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తామెప్పుడూ సిఫారసు చేయలేదని అదే ఆర్థిక సంఘం చైర్మన్‌, సభ్యులు స్పష్టం చేశారు. రైల్వే జోన్‌ పొందేందుకు విశాఖకు అన్ని అర్హతలు ఉన్నా సంబంధిత రాష్ట్రాలను సంప్రదించాలంటూ à°† హామీని కూడా తుంగలో తొక్కారు.
 
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును శీఘ్రగతిన పూర్తి చేయాలని చట్టంలో పేర్కొన్నా.. తన బాధ్యతను తప్పించుకోవడానికి కేంద్రం దీన్ని రాష్ట్రంపైన పెట్టి నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన కేబీకీ ప్యాకేజీకీ తూట్లు పొడిచారు. దుగరాజపట్నం పోర్టు, à°•à°¡à°ª స్టీల్‌ ప్లాంట్‌, కాకినాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ-పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ హామీలను అటకెక్కించారు. ప్రపంచంలోనే అత్యద్భుత రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని వాగ్దానం చేసిన ప్రధాని మోదీ గుప్పెడు మట్టి, చెంబు నీళ్లు తెచ్చి ఇచ్చారు. జాతీయ విద్యా సంస్థల పురోగతి నత్తనడకను తలపిస్తోంది. షెడ్యూల్‌ 9, 10లో ఉన్న సంస్థల ఆస్తుల పంపకం కూడా సక్రమంగా జరగడం లేదు. ఐదేళ్ల క్రితం చేసిన బాసలను గుర్తుకు తెచ్చుకుని.. వాటిని అమలు చేసిన తర్వాతే రాష్ట్రంలో మీరు అడుగుపెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేని పక్షంలో.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తిగానే గాక.. భారత పార్లమెంటును, దాని సార్వభౌమాధికారాన్ని అగౌరవపరిచిన ప్రధానిగా చరిత్రలో మీరు మిగిలిపోతారు’ అని కేవీపీ హెచ్చరించారు.