కర్నూలు టూరులో ప్రశ్నించిన పవన్‌

Published: Wednesday February 27, 2019
‘‘శ్రీశైలం ప్రాజెక్టు కూతవేటు దూరంలో ఉన్నా తాగునీటి సమస్య, ఫ్లోరైడ్‌ సమస్య మాత్రం తీరడం లేదు. రాయలసీమ ముద్దుబిడ్డ అంటున్న వైసీపీ అధినేత జగన్‌కు à°ˆ సమస్యలు పట్టవా..? సీమ సమస్యలపై ఆయన చట్టసభల్లో ఎందుకు మాట్లాడటం లేదు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. 30 ఏళ్ల సీఎం పదవి à°•à°² తప్ప జగన్‌కు ప్రజాసమస్యలు పట్టడం లేదని విమర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం కర్నూలులో పార్టీ కార్యకర్తలు, మహిళా సదస్సులోను, నంద్యాల, ఆళ్లగడ్డలో రోడ్‌షో లోను పాల్గొన్నారు. రాయలసీమ అనేది కొన్ని కుటుంబాల గుత్తాధిపత్య ప్రాంతం కాదని à°ˆ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యానించారు.
 
‘‘రాయలసీమ జిల్లాల్లో ఎక్కడికి వెళ్లినా 60-40 శాతం అన్న పదమే వినిపిస్తుంది. ఇదేమిటని ఆరా తీస్తే ప్రగతి పనులను 60 శాతం అధికార పార్టీ, 40 శాతం ప్రతిపక్ష నాయకులు పంచుకుంటున్నారని తెలిసింది. ఇదేం పద్ధతి?’’ అని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తుందని హామీ ఇచ్చారు. ‘‘సినిమాల్లో నిర్మాతలు నష్టపోతే నా సొంత డబ్బునే పంచేశాను. మా ప్రభుత్వం వస్తే నేను ధర్మకర్తగా మాత్రమే ఉంటా’’నన్నారు.
 
యుద్ధాలన్నీ ఎన్నికల ముందేనా?
‘‘దేశభక్తి బీజేపీ హక్కు కాదు. మనందరి బాధ్యత. ఎన్నికల ముందే యుద్ధాలు రాబోతున్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలి?’’ అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తామన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా, నందికొట్కూరు నియోజకవర్గంలో కొణిదెల గ్రామం ఉందని తెలిసిందని పవన్‌ తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రి పరిటాల సునీతపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ‘జనసేనకు పది మంది కుర్రాళ్ల గోల తప్ప అక్కడ (అనంతపురం) ఏమీ లేదు. à°…à°‚à°¤ మాత్రానికే మమ్మల్ని చూసి భయపడటం ఎందుకు? 2009 ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాలేదు.
 
అలాంటి పార్టీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. నేను, మా జనసైనికులు కలిసి 12.5 శాతం ఓటుబ్యాంకును జమ చేస్తే రెండు శాతం ఓట్లతో బయటపడ్డారు’’ అని పవన్‌ తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా అహోబిలం నరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం రాత్రి జనసేన అధినేత పవన్‌, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. దాదాపు 15 నిమిషాలపాటు ఇద్దరు మాట్లాడుకున్నారు.