జయప్రకాష్ నారాయణతో పవన్ భేటీ

Published: Thursday February 08, 2018

హైదరాబాద్: à°à°ªà±€ హక్కుల కోసం జేఏసీ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు. బుధవారం జయప్రకాష్ నారాయణకు ఫోన్ చేసిన పవన్ కొద్ది సేపటి క్రితం ముఖాముఖి కలిశారు. ఏపీ హక్కుల సాధన కోసం తెలంగాణ తరహా పోరాటం అవసరమని పవన్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఏపీలోనూ జేఏసీ అవసరమని భావిస్తున్నారు. ఏపీలో కూడా పార్టీలతో ప్రమేయం లేకుండా నేతలందరూ కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. హోదా కోసం పోరాడేవారందరితో కలిసి పనిచేస్తామని జనసేనాని తెలిపారు. అందుకే జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ తదితరులను కలుపుకుపోతూ జేఏసీ అవసరమని అభిప్రాయపడుతున్నారు. నిన్న జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌à°•à°¿ ఇదే విషయాన్ని చెప్పారు ఆయన.