పాక్‌పై దాడితో మోదీకి మొగ్గు

Published: Sunday March 03, 2019
 à°®à±à°–్యమంత్రి కావడం తన à°•à°² అని వైసీపీ అధినేత జగన్‌ తెలిపారు. అందుకే తాను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లానన్నారు. అయితే... అధికారానికి పాదయాత్ర దగ్గరి మార్గం అవుతుందో లేదో తనకు తెలియదని చెప్పారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, వారిలో కొత్త ఆశలు చిగురించాయని తెలిపారు. ‘వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మరోచోటికి తరలిస్తారు’ అనే అనుమానాలపై సూటిగా, స్పష్టంగా స్పందించలేదు. శనివారం ఢిల్లీలో ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో ఆయన పాల్గొన్నారు. సీనియర్‌ జర్నలిస్టు రాహుల్‌ కన్వాల్‌ à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు ఆయన సమాధానాలిచ్చారు.
 
‘‘మీరు అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తారా? లేక నిలిపివేస్తారా?’’ అనే ప్రశ్నకు జగన్‌ సూటిగా సమాధానం చెప్పలేదు. అమరావతి నిర్మాణ ప్రక్రియపై ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘రాజధాని à°’à°• పెద్ద కుంభకోణం. రాజధాని భూసమీకరణ ముసుగులో రైతుల నుంచి భూములు సేకరించారు. 1600 ఎకరాలను తక్కువ ధరకు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు కట్టబెట్టారు’’ అని తెలిపారు. అసలు ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దానికి భిన్నంగా ఏం చేస్తారని ప్రశ్నించగా... ‘‘స్థానిక సమస్యలను గ్రామ సచివాలయం ద్వారానే పరిష్కరిస్తాం. వివక్ష లేకుండా పథకాల ప్రయోజనాలను అందరికీ అందిస్తాం. ఇప్పటికే నవరత్నాలను ప్రకటించాను’’ అని బదులిచ్చారు.