పట్టు వదలని టిడీపీ ఎంపీలు

Published: Friday February 09, 2018

టీడీపీ ఎంపీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అయిదు రోజులుగా నిరసనల ఉద్ధృతి పెంచారే తప్ప.. తగ్గించలేదు. స్పీకర్ వారించినా, కేంద్ర మంత్రులు సర్దిచెప్పాలని చూసినా వెనకడుగు వేయలేదు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తానికి తెలియజేశారు.

టీడీపీ ఎంపీల పోరాటానికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. మార్గదర్శనం చేశారు. కేంద్రంలో కీలక మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాధ్ సింగ్ రాయబారాలు నడిపినా.. ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. ఏపీ ప్రజలకంటే తమకు ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేసారు. హామీలు ఇస్తే సరిపోదని.. స్పష్టమైన కార్యాచరణ లేనిదే ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. ఆఖరికి దుబాయ్‌à°•à°¿ వెళ్లినా కూడా ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు.

టీడీపీ ఎంపీలు ఆందోళనలు ఉధృతం చేసినా.. కేంద్రం మాత్రం తమ నైజాన్ని మార్చుకోలేదు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. మళ్లీ పాత పాటే పాడారు. ఎక్కడా నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించకుండానే.. పాత హామీలతోనే సరిపుచ్చారు. ఇది టీడీపీ ఎంపీలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. తాము ఇంత పోరాడుతున్నా.. కేంద్రం కొంచెం కూడా స్పందించకపోవడంతో సుజనా చౌదరి.. ఏకంగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో వాగ్వాదానికి దిగారు. తద్వారా తాము à°ˆ అంశంలో à°Žà°‚à°¤ సీరియస్‌à°—à°¾ ఉన్నామో స్పష్టం చేశారు.