ఎంపీ గల్లా జయదేవ్‌కు ఘన స్వాగతం

Published: Monday February 12, 2018

‘రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి ఢిల్లీలో అందరూ మద్దతిస్తున్నారు. రైల్వేజోన్‌ విషయంలో మిత్రపక్షం మాటకాదని ఒడిశా అభ్యంతరం చెబుతోందనడం సహేతుకం కాదు. ఏపీ ప్రజలు ఫూల్స్‌ కారని, ఎల్లకాలం మోసపోరని ప్రధాని మోదీ, అమిత్‌à°·à°¾ గుర్తు పెట్టుకోవాలి..’ అని ఎంపీ గల్లా జయదేవ్‌ మరోసారి స్పష్టం చేశారు. గతవారం లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాల్లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై తనదైన శైలిలో ప్రసంగించి, రాష్ట్ర ప్రజల జేజేలు అందుకుంటున్న ఎంపీ జయదేవ్‌ ఆదివారం తన సొంత నియోజకవర్గం గుంటూరు వచ్చారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద టీడీపీ నాయకులు ఆయనకు ఎదురెళ్లి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వరకు వాహన ర్యాలీ నిర్వహించారు.

à°ˆ సందర్భంగా జరిగిన సభలో జయదేవ్‌ ప్రసంగించారు. ‘యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది. పోరాటానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఢిల్లీకి వెళ్లి ఆందోళన చేసేందుకు సంసిద్ధులు కావాల’ని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని చేస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్ష వైసీపీ పార్లమెంట్‌లో గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

 ‘మా ఆందోళనలను ప్రధాని చూశారు. ఆయన ప్రసంగంలో ఏపీ గురించి ఏమైనా మాట్లాడతారేమోనన్న ఆశతో à°† సమయంలో మేం వెనక్కు తగ్గాం. వైసీపీ ఎందుకు వాకౌట్‌ చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీతో చేతులు కలిపేందుకు ఆరాటపడుతూ నిరంతరం ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నార’ని జయదేవ్‌ విమర్శించారు.