టీడీపీలో మరికొందరిపై జగన్‌ ‘కన్ను’

Published: Friday March 15, 2019
అధికార పక్షం నుంచి వలసలు, పార్టీలో చేరికలు, అభ్యర్థుల్లో చేర్పులు మార్పులు à°“ వైపు... సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి సిద్ధమవ్వాల్సిన సమయం మరోవైపు... ఈనేపథ్యంలో జగన్‌ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితా ముందేసుకున్నారు. రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌తోసర్వే నివేదికపై సమీక్షిస్తూ రోజంతా గడిపినట్లు తెలిసింది. అధికారపక్షం అభ్యర్థి బలాలు, బలహీనతలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు.
 
ప్రశాంత్‌ కిశోర్‌తో నియోజవర్గాల వారీగా గెలుపోటములపై లెక్కలు వేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి మరింత మంది బలమైన అభ్యర్థులను లాగడానికి ఉన్న అవకాశాలనూ ఆయన సమీక్షించినట్లు తెలిసింది. ఆమేరకు ప్రశాంత్‌ కిశోర్‌తో జగన్‌ సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్‌, అభ్యర్థుల విషయంలో పకడ్బందీ వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. à°ˆ ఎన్నికలు ముఖ్యమంత్రి చంద్రబాబుకూ, తనకూ మధ్య జరుగుతున్నవిగానే పార్టీ క్యాడర్‌తో ప్రచారం చేయిస్తున్నారు.
 
దీని ద్వారా జనసేన పార్టీని సోదిలో లేకుండా చేయాలన్నది జగన్‌ రాజకీయ ఎత్తుగడగా à°† వర్గాలు చెబుతున్నాయి. 2014 తరహాలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ప్రభావం నామమాత్రంగా ఉంటుందని జగన్‌ భావిస్తున్నాని à°† వర్గాలు అంటున్నాయి. అయితే, జనసేన గురించిన చర్చ ప్రజల్లో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక వస్తుందనీ, అది తన రాజకీయ భవిష్యత్తుకు చేటు తెస్తుందని జగన్‌ ఆందోళన చెందుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. గురువారం పీకేతో జరిపిన సమావేశంలో à°ˆ అంశమూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.