విశాఖకు నౌకాదళం మరో వరం

Published: Thursday February 15, 2018

తూర్పు నౌకాదళం మరో వరం ప్రసాదించింది. యుద్ధ విమానం ‘సీ హేరియర్‌’ను మ్యూ జియంగా మార్చడానికి ముందుకు వచ్చింది. అనువైన స్థలం చూపిస్తే పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. విశాఖపట్నంలో నేవీకి సంబంధించి ఇప్పటికే రెండు మ్యూజియంలు ఉన్నాయి. అందులో à°’à°•à°Ÿà°¿ సబ్‌మెరైన్‌ కురుసుర కాగా, మరొకటి టీయూ-142 యుద్ధవిమానం. ఇటీవలే రాష్ట్రపతి కోవింద్‌ ప్రారంభించడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. à°ˆ మ్యూజియం కోసం ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ రూ.13 కోట్లు కేటాయించగా, బీచ్‌ రోడ్డులో ఏర్పాటుచేసి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ అనేక హంగులు సమకూర్చింది. à°ˆ యుద్ధ విమానాన్ని సందర్శించేందుకు రోజుకు సగటున 4 వేల మంది వస్తున్నారు. à°ˆ మ్యూజియం చూసి నేవీ ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు.

టీయూ-142ని సేవల్లోకి తీసుకున్న మొదటిరోజున కూడా ఇంత అందంగా చూడలేదని, అద్భుతంగా తయారుచేశారని వుడా అధికారులను ప్రశంసించారు. దీనికి ప్రజాదరణ అధికంగా వుండడంతో ఏడాదిన్నర క్రితం సేవల నుంచి విరమించిన సీ హేరియర్‌లో à°’à°•à°Ÿà°¿ విశాఖకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై నేవీ అధికారులు రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శికి లేఖ రాయగా, ఆయన జిల్లా అధికారులకు తెలియజేశారు. సీ హేరియర్‌ బ్రిటీష్‌ దేశానికి చెందిన యుద్ధ విమానం.

1983లో వీటిని మన నౌకాదళంలో ప్రవేశపెట్టారు.సీ హేరియర్‌ ఇతర యుద్ధ విమానాల కంటే భిన్నమైంది. ఆకాశం నుంచి గెంతినట్టు నిట్టనిలువుగా ల్యాండ్‌ అవుతుంది. టేకాఫ్‌ కూడా అలాగే తీసుకుంటుంది. వీటిని ‘వైట్‌ టైగర్స్‌’గాను వ్యవహరిస్తారు. సీ హేరియర్‌ యుద్ధ విమానాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి స్థలం అన్వేషిస్తున్నామని రుషికొండలో గానీ, వుడా పార్కు లోపల గానీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.