అతి త్వరలోనే రైల్వేజోన్‌ : ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు

Published: Thursday February 15, 2018

అతి త్వరలోనే ఉత్తరాంధ్రకు రైల్వేజోన్‌ లభించనుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రజాసదన్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని తమ పార్టీ ఎంపీలంతా పార్లమెంట్‌లో నిరసన చేపట్టామని చెప్పారు. ఇటీవలే రైల్వేజోన్‌పై స్పష్టత నెలకొందని తెలిపారు. వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళం ముద్రపడి ఉందంటూ పలు సమస్యలపై రైల్వేమంత్రి పీయూ ష్‌గోయల్‌, ప్రధానమంత్రి మోదీకి స్వయంగా కలిసి తాను వివరించానని చెప్పారు. జిల్లాలోని పలాస, మందస రోడ్‌, జాడుపూడి, సుమ్మా దేవి, ఇచ్ఛాపురం, బారువ రైల్వేజంక్షన్లను విశాఖ జోన్‌లోనే కలపాలని డిమాండ్‌ చేసామని తెలిపారు.

విభజన చట్టం ప్రకారం 19హామీలను కేంద్రం అమలు చేయాల్సి ఉందని చెప్పారు. ఏప్రిల్‌ 6à°¨ రాజీనామాలు చేస్తామని వైసీపీ ఎంపీల ప్రకటన కొత్త డ్రామాగా కొట్టిపారేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజీనామాలకు టీడీపీ ఎంపీలంతా ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారని స్పష్టం చేశారు. జగన్‌ పాదయాత్రకు గుర్తింపు లేకపోవడంతో రాజీనామా అంశాన్ని తెర పైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. గతంలోనూ ఇలాగే ప్రకటించి, పార్లమెంట్‌లో అందరికంటే ముందు వెళ్లి వైసీపీ ఎంపీలే కూర్చున్నారని గుర్తు చేశారు.

ప్రధాని ప్రసంగిస్తుంటే వైసీపీ ఎంపీలు పారిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. మిత్రపక్షం, మిత్రధర్మం అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడమని తెలిపారు. టీడీపీపై బీజేపీ వారే బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, నగర పార్టీ అధ్యక్షుడు à°Žà°‚.వెంకటేష్‌, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.