ఒక్క అవకాశమిస్తే.. రాజధాని, పోలవరం బంద్‌

Published: Wednesday April 10, 2019
‘ఒక్క అవకాశమివ్వాలని జగన్‌ అంటున్నారు. ఇస్తే పోలవరం, రాజధాని ఆగిపోతాయి. శ్రీశైలం, సాగర్‌ కేసీఆర్‌ చేతిలోకి పోతాయి. అసలాయనకు ఎందుకు అవకాశమివ్వాలి? కేసీఆర్‌ ఏమీ చేయకున్నా 88 స్థానాల్లో గెలిచారు. ఇన్ని చేసిన మనం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలవాలి. కేసీఆర్‌ దగ్గర తలదించుకొనే పరిస్థితి తేవొద్దు. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా! మోదీ ప్రభుత్వంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయింది. ఈసారి కేబినెట్‌లో వారికి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తా.
 
అమరావతిలో 10 ఎకరాల్లో మసీదు నిర్మిస్తున్నాం. ఎన్నికల్లో ఈవీఎంలను మార్చి గెలవాలనుకుంటున్నారు. అలాంటివి చేస్తే ఖబడ్దార్‌.. శాశ్వతంగా జైళ్లకు వెళ్తారు. ఇక్కడ ఓట్లు తొలగించేందుకు అక్రమ ఫిర్యాదులు చేసిన వారి కంప్యూటర్ల ఐపీ అడ్ర్‌సలు ఇవ్వమంటే ఈసీ ఇవ్వలేదు. దీని వెనక కాపలాదారు ఉన్నాడు. లేకుంటే ఎప్పుడో వాళ్ల మక్కీలు విరగ్గొట్టి జైలులో పెట్టేవాడిని.’
 
‘ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 10ు వీవీ ప్యాట్స్‌ అయినా లెక్కించాల్సిందే. దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తాం. మోదీ ఆధ్వర్యంలో ఈసీ పని చేస్తోంది. 66 మంది విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.’