విభజన హామీలపై అఖిలపక్షంతో చర్చలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Published: Monday February 19, 2018

రాష్ట్ర విభజన హామీలపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని పార్టీలను సమావేశపరిచి విభజన హామీలపై చర్చిస్తామని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమలు కావడం లేదన్నారు. సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదో ప్రజలకు కేంద్రమే చెప్పాలన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం వ్యవహరించాలని కోరారు. పోలవరం పూర్తికాకుండా వైసీపీ, కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయని సీఎం ఆరోపించారు. ఎన్డీయే నుంచి టీడీపీ దూరమైతే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వైసీపీ యత్నిస్తోందని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసమంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.. అసెంబ్లీ పార్లమెంట్ చట్టాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.