మహిళా సంఘాల ఉచ్చులో రాం గొపాల్ వర్మ

Published: Monday February 19, 2018

‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా విషయంలో పోలీసు విచారణ ఎదుర్కొన్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వర్మ ల్యాప్‌టాప్‌లోని రహస్యాలను వెలికితీసేందుకు సీసీఎస్ పోలీసులు సిద్ధమయ్యారు. à°ˆ క్రమంలో వర్మ వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపించారు. ప్రాథమిక నివేదిక కోసం సీసీఎస్ పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఆపిల్ ల్యాప్‌టాప్ కావడంతో లాక్ డీకోడ్ చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు. కాగా, పోలీసుల విచారణకు హాజరైన వర్మ.. జిఎస్‌à°Ÿà°¿ సినిమా డైరెక్షన్ అంతా స్కైప్ ద్వారానే జరిగిందని పోలీసులకు వర్మ తెలిపారు. వర్మ చెప్పిన అంశాలపై నిర్ధారణ కోసం సీసీఎస్ పోలీసులు స్కైప్‌కు లేఖ రాశారు.