సవాల్‌కు నేను సిద్దం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Published: Tuesday February 20, 2018

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విసిరిన సవాల్‌ కు తాను సిద్దంగా  ఉన్నట్లు   à°œà°¨à°¸à±‡à°¨ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్లమెంటులో విభజన హామీలపై వైసీపీ ముందుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను బేషరతుగా మద్దతు పలుకుతానని వెల్లడించారు. à°ˆ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సంఖ్యతో పని లేదనీ, ఒక్క ఎంపీ ఉన్నా చాలని చెప్పారు. సోమవారం సాయంత్రం ఇక్కడి జనసేన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ చర్చకు స్వీకరించినప్పుడు మాత్రం 50 ఎంపీల మద్దతు కావాలని.. 80 మంది మద్దతు దొరుకుతుందన్న విశ్వాసం తనకుందని చెప్పారు.

 à°®à°¾à°°à±à°šà°¿ 5à°µ తేదీన పార్లమెంటు ప్రారంభం కాగానే వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. దానికి తాను అన్ని పక్షాల మద్దతూ పలికేలా చూస్తా అన్నారు . 4à°µ తేదీన ఢిల్లీకి వచ్చి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, ఆప్‌, టీడీపీ తదితర పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. వీలైతే మంగళవారమే పార్లమెంటు సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇవ్వాలని సూచించారు. ‘5à°µ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత స్పీకర్‌ దాన్ని చర్చకు స్వీకరిస్తారు.

 à°…పుడు 50 మంది ఎంపీల మద్దతు ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మందే మద్దతు పలుకుతారు. ఏపీ విభజన సమస్యకు మద్దతిస్తామని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ తరపున రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌ గతంలో చెప్పారు. అవసరమైతే నేను కర్ణాటక, తమిళనాడుకూ వెళ్లి అక్కడి పార్టీలతో మాట్లాడతాను. టీడీపీ, వైసీపీ కలిస్తేనే పాతిక మంది ఎంపీలు అవుతారు. విభజన సమస్యలపై ఎంపీలందరూ పార్లమెంటులో గట్టిగా మాట్లాడాలి. ప్రజల పక్షాన కొట్లాడాలి’ అని డిమాండ్‌ చేశారు. పార్టీలకు అతీతంగా à°ˆ పోరాటం సాగాలన్నారు. జనసేనతోపాటు à°…à°–à°¿à°² పక్షం వైసీపీకి మద్దతుగా నిలుస్తాయన్నారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి à°† క్రెడిట్‌ మీరే దక్కించుకోండని జగన్‌కు పవన్‌ సూచించారు. తీర్మానం కోసం మంగళవారమే ఢిల్లీ వెళ్తారా.. 4à°¨ వెళ్తారా అనేది వైసీపీ నిర్ణయించుకోవాలని చెప్పారు. జగన్‌ ధైర్యం, దమ్మున్న వ్యక్తి అని.. గొప్ప నాయకుడని.. కేంద్రానికి వ్యతిరేకంగా తిరగబడాలని.. తామంతా à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని హామీ ఇచ్చారు. ఒకవేళ వైసీపీ తీర్మానం ప్రవేశపెట్టకపోతే టీడీపీ à°† పని చేయాలన్నారు. ఇద్దరిలో ఎవరు ప్రవేశపెట్టినా జనసేన మద్దతు ఉంటుందని చెప్పారు. కాగా.. విభజన హామీల సాధనలో టీడీపీ, వైసీపీ రెండూ ప్రధానికి భయపడుతున్నట్లుగా అనిపిస్తోందని పవన్‌ అన్నారు. మోదీ సభలోకి రాగానే వైసీపీ వాకౌట్‌ చేస్తోందని.. ఇది సరైన పద్ధతి కాదని, అందరం ఐక్యంగా పోరాటం చేద్దామని పిలుపిచ్చారు.