ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది : చంద్రబాబు నాయుడు

Published: Monday February 26, 2018

మన కష్టంతో మన రాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నామని, ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. విశాఖ సదస్సు విజయవంతం కావడం శుభపరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జలసంరక్షణ ఉద్యమం సత్ఫలితాలు ఇస్తోందని అన్నారు. ఏపీలో భూగర్భజలాలు 1.6మీ. పెరిగాయని... రెండో దశ జలసంరక్షణ ఉద్యమం ఉత్సాహంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఉన్న అవరోధాలు తొలగించాలన్నారు.

 

నరేగా ద్వారా గ్రామాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలని బాబు తెలిపారు. 14à°µ ఆర్ధిక సంఘం నిధులు రూ.745కోట్లు విడుదల చేశామన్న బాబు గతం నిధులు రూ.300కోట్లు పూర్తిగా వ్యయం చేయాలని అధికారులకు సూచించారు. రూ.1,045కోట్లతో గ్రామాల్లో మౌలికవసతులు అభివృద్ధి చేయాలన్నారు. కరవు మండలాలలో అదనంగా మరో 50పనిదినాలు కల్పించాలన్నారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని... విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సమావేశంలో తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. పెన్షన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలన్నారు. వేసవిలో పశుగ్రాస కొరత లేకుండా శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధి హామీ à°•à°¿à°‚à°¦ నర్సరీలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు తెలిపారు.