సికింద్రాబాద్‌-విజయవాడ జంక్షన్ల నడుమ మరమ్మతులు

Published: Tuesday May 28, 2019
ట్రాక్‌, బ్రిడ్జిల మరమ్మతుల పేరిట కొన్ని రైళ్లను రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా వస్తుండడంతో à°—à°‚à°Ÿà°² తరబడి స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలే వేసవి కాలం కావడంతో ఎండలకు, ఉక్కపోతకు తాళలేక పోతున్నారు.
 
దక్షిణ మధ్య రైల్వేకు గుండెకాయగా పేరొందిన సికింద్రాబాద్‌ జంక్షన్‌ నుంచి ప్రతిరోజూ 150 ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల ద్వారా దాదాపు 2 లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. నగరం నుంచి ఎక్కువగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడకు వెళ్తుంటారు. వారం రోజులుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు నిర్ణీత సమయానికి రైళ్లు రాకపోవడంతో ఆయా స్టేషన్లలో ప్రయాణికులు à°—à°‚à°Ÿà°² తరబడి నిరీకిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
 
విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ జంక్షన్‌కు నడిచే ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వారం రోజులుగా à°—à°‚à°Ÿà°² తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి నడిచే శాతవాహన సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ స్టేషన్‌కు 11.45 గంటలకు రావాల్సి ఉండగా, నాలుగు రోజుల క్రితం ఆలస్యం కారణంగా 1.20 గంటలకు చేరుకుంది. మార్గమధ్యంలో భువనగిరి స్టేషన్‌ వద్ద దాదాపు గంటన్నరపాటు నిలిపివేయడంతో ప్రయాణికులు నానా అవస్థ పడ్డారు. ఆదివారం కూడా ఇదే రైలు హైదరాబాద్‌కు 12.54 గంటలకు చేరింది. భువనేశ్వర్‌ నుంచి ముంబయి వరకు నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ 11.40 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా, 12.14 గంటలకు వచ్చింది. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణించిన వారు ఎండవేడిమి, ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
 
 
సాధారణ ప్రయాణికుల కంటే బొగ్గు రవాణాతోటే అధిక లాభం ఉంటుందని భావించిన దక్షిణ మధ్య రైల్వే కొన్ని రోజులుగా కాజీపేట నుంచి మణుగూరుకు నడిచే మణుగూరు ప్యాసింజర్‌, బల్లార్షా నుంచి కొత్తగూడెం వరకు నడిచే సింగరేణి ఫాస్ట్‌ ప్యాసింజర్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. ప్రస్తుత వేసవిలో à°ˆ రెండు రైళ్లను నడిపించడం ద్వారా కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి స్టేషన్ల నుంచి బొగ్గు రవాణాలో ట్రాఫిక్‌ అడ్డంకులు ఎదురవుతున్నాయనే భావనతో వాటిని కొన్ని రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేసి గూడ్స్‌ రైళ్లను వేగవంతంగా నడిపించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సింగరేణి రైలు స్థానంలో ఫుష్‌పుల్‌ రైలును నడిపించడం వరకు బాగానే ఉన్నప్పటికీ అందులోని 12 కోచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే మరుగుదొడ్ల సదుపాయం ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.