కర్నూలు లేదా నెల్లూరు జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ

Published: Wednesday June 12, 2019
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్లాంట్‌ మరొకటి రాష్ర్టానికి రానుందని సమాచారం. సీఎం జగన్‌ ఇటీవల బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లాతో సమావేశమయ్యారు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ à°ˆ గ్రూప్‌నకు చెందిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, అన్నిరకాల మద్దతు అందిస్తామని బిర్లాకు హామీ ఇచ్చారు. ఒక్క సిమెంటు రంగంలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రంగాల్లో కూడా పలు అవకాశాలున్నాయని, వాటిని కూడా పరిశీలించాలని కోరారు. à°† భేటీకి కొనసాగింపుగా కూడా à°† తర్వాత చర్చలు జరిగాయి. కర్నూలు లేదా నెల్లూరు జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ప్రారంభించేందుకు బిర్లా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఉంది. నెలకు సుమారు 3లక్షల టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తోంది. వేలమంది à°ˆ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో ప్లాంటు పెడితే à°† మేరకు పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడాన్ని జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయరంగానికి తొలి ప్రాధాన్యం ఇస్తూనే.. అదే సమయంలో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపనే మార్గమని ఆయన భావిస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే పెట్టుబడుల కోసం దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సీఎం మాట్లాడారు. కుమారమంగళం బిర్లాతోపాటు రతన్‌టాటా, గౌతంఅదానీ తదితరులతో మాట్లాడారు. ఫలితంగా సిమెంటు పరిశ్రమకు మార్గం సుగమమైందని అంటున్నారు. త్వరలో మరింతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతోనూ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ కానున్నట్లు సమాచారం. à°ˆ క్రమంలో కొందరిని ఆయన వ్యక్తిగతంగా కలిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే కొందరు పారిశ్రామికవేత్తల నుంచి కూడా జగన్మోహన్‌రెడ్డికి ఆహ్వానాలు వస్తున్నాయని తెలిసింది.