ఇసుక విక్రయాలపై పన్ను ద్వారా 2 వేల కోట్లు

Published: Monday June 17, 2019
రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చడానికి, రెవెన్యూ లీకేజీలు అరికట్టడానికి, ఖజానాపై భారం తగ్గడానికి ఆర్థిక శాఖ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. à°ˆ దిశగా ప్రభుత్వం కొంత దృష్టి పెడితే రూ.17,500 కోట్లు ఖజానాకు సమకూరుతాయని పేర్కొంది. ఇందులో కేంద్రం నుంచి రూ.10,000 కోట్ల మేర రెవెన్యూ లోటు గ్రాంటు కోరాలని ఆర్థిక శాఖ అధికారులు సూచించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో అంచనా వేసిన రెవెన్యూ కంటే వాస్తవ రెవెన్యూ రూ.5,000 కోట్ల మేర తగ్గే అవకాశం ఉందని, వివిధ మార్గాల్లో à°† లోటు పూడ్చుకోవాలని సూచించారు. ఇసుక విక్రయాలపై పన్ను విధించడం ద్వారా రూ.2,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.
 
వాటర్‌ సెస్‌ సేకరణను గాడిలోకి తేవడం ద్వారా అదనంగా రూ.500 కోట్లు వస్తాయని పేర్కొన్నారు.. అలాగే, కార్పొరేషన్లు వాటి సొంత నిధులు, కేంద్ర నిధుల ద్వారానే గట్టెక్కాలని, పౌరసరఫరాల కార్పొరేషన్‌ కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా గ్రాంట్ల ద్వారానే ధాన్యాలు, ఇతర సరుకుల సేకరణ చేసుకోవాలని, ఆర్టీసీ చార్జీలు క్రమబద్ధీకరించాలని, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా రెవెన్యూ లీకేజీలు అరికట్టాలని సూచించారు. స్థానిక సంస్థలు వాటి ఆదాయ మార్గాలు పెంచుకోవాలన్నారు.