మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు..

Published: Thursday June 20, 2019
పోలవరం కాలువపై నీటిని తోడడానికి వినియోగించిన పైపుల విషయంలో రేగిన వివాదంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అతని అనుచరులపై పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలివీ.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా నదిలోకి వెళ్తున్న గోదావరి నీటిని దెందులూరు నియోజకవర్గంలోని పంట పొలాలకు సరఫరా చేయడానికి అనువుగా మూడేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ఆధ్వర్యంలో పైపులను ఏర్పాటు చేసి, నీటిని చెరువులకు మళ్లించారు. పెదవేగి, పెదపాడు మండలాల్లోని పలు గ్రామాలకు à°ˆ నీటిని మళ్లించడంతో పంటలు పుష్కలంగా పండాయి. à°† పైపులను అప్పట్లో నాటి ఎమ్మెల్యే ప్రభాకర్‌ కొనుగోలు చేసి వేయించారు. కాగా నీటిని పెట్టుకున్నందుకు ఏటా ఎకరానికి రూ.వెయ్యి ఇస్తున్నామని, à°ˆ విధంగా పైపుల ధరకు రెట్టింపు సొమ్మును ఇచ్చామని రైతులు చెబుతున్నారు. అయితే రైతులిచ్చిన సొమ్ము ఏటా నిర్వహణ ఖర్చులకే సరిపోలేదని చింతమనేని పేర్కొంటున్నారు. మూడేళ్లపాటు ఉంచిన పైపులను ఇప్పుడు తీసుకెళ్లడంపై రైతులు ఆక్షేపిస్తున్నారు.
 
ఇంకోవైపు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పైపులు తీసుకెళ్లినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లక్షలాది రూపాయలను చెల్లించిన రైతులకే à°† పైపులు చెందుతాయని, వాటిని వెంటనే అదే ప్రదేశంలో ఉంచాలని, ఆందోళనను తిరిగి కొనసాగిస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. పైపుల దౌర్జన్యంగా తీసుకెళ్లారని అందిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, మరో నలుగురిపై పెదవేగిలో కేసు నమోదు చేశారు.