రూ.3 లక్షల వరకు ఐటీ మినహాయింపు

Published: Friday June 21, 2019
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా సెక్షన్‌ 80సీ ప్రకారంగా లభించే పన్ను రాయితీల పరిమితిని సైతం రూ.2 లక్షలకు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అలాగే ఐటీ చట్టంలోని సెక్షన్‌ 80సీ పరిధిలోకి వచ్చే పొదుపు, పెట్టుబడులపై పన్ను చెల్లింపుదారులు ఏడాదిలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. 2014 నుంచి కేంద్రం à°ˆ రెండు పరిమితులను యథాతథంగా కొనసాగిస్తూ వస్తోంది. మోదీ మలి విడత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ వచ్చే నెల 5à°¨ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే దేశంలోని 5 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు కనీసం రూ.2,500 చొప్పున లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. పన్ను మినహాయింపు పరిమితుల పెంపు మందగించిన ఆర్థిక వ్యవస్థకు నూతనోత్తేజాన్ని ఇవ్వనుందని విశ్లేషకులు అంటున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్ఠ స్థాయి 5.8 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే.
 
2019-20à°•à°¿ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌.. పన్ను శ్లాబులను, ఆయా శ్లాబులకు వర్తించే పన్ను రేట్లను యథాతథంగా కొనసాగించారు. అయితే రూ.5 లక్షల వరకు వార్షికాదాయంపై పూర్తి పన్ను రిబేటు కల్పించారు. అంతేకాదు వేతన జీవులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ తొలి విడత ప్రభుత్వం 2019, ఫిబ్రవరి 1à°¨ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అరుణ్‌ జైట్లీ అనారోగ్యం కారణంగా తాత్కాలిక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పీయూష్‌ గోయల్‌.. తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.