పవన్ పై చంద్రబాబు విమర్శల జల్లు

Published: Thursday March 15, 2018


 à°œà°¨à°¸à±‡à°¨ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘‘నిన్నటిదాకా జగన్, విజయసాయిరెడ్డితో డ్రామా ఆడించారు. అది వికటించేసరికి ఇప్పుడీ కొత్త డ్రామా ప్రారంభించారు. తమిళనాడు తరహా డ్రామాలు ఇక్కడ నడవవు. à°ˆ నాటకాల స్క్రిప్ట్‌లు ఎక్కడనుంచి వచ్చాయో అందరికీ తెలుసు’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
 
ఎంపీలు, అసెంబ్లీ వ్యూహ కమిటి ప్రతినిధులతో గురువారం ఉదయం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ఎర్రచందనం స్మగ్లర్లపై à°Ÿà±€à°¡à±€à°ªà±€ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, స్మగ్లింగ్‌ను పూర్తిగా నియంత్రించిందని చెప్పారు. దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తనపై మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదులు పంపారని చంద్రబాబు గుర్తు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు సాగించారని, అయినా తాను బెదిరింపులకు భయపడలేదని, అలాంటిది ఎర్రచందనంపై పవన్ కల్యాణ్ అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరమని చంద్రబాబు అన్నారు. అలాగే ఫాతిమా కాలేజీ విద్యార్ధులకు తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎ చంద్రబాబు à°•à±Šà°Ÿà±à°Ÿà°¿à°ªà°¾à°°à±‡à°¶à°¾à°°à±.