కుటుంబ సభ్యులు పింఛన్ కోసం ప్రాణం పోశారు

Published: Friday March 16, 2018


 à°ªà°¿à°¡à±à°—ురాళ్ళు ;చనిపోయిన మనిషికి లైఫ్‌ సర్టిఫికెట్‌ సంపాదించి 14 నెలలుగా పింఛన్‌ స్వాహా చేస్తున్న వ్యవహారం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన తల్లం సైదులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1994లో రిటైరయ్యారు. సైదులు 2005లో మరణించడంతో అప్పటి నుంచి ఆయన భార్య తల్లం తులశమ్మ పెన్షన్‌ పొందుతున్నారు. తులశమ్మ పెన్షన్‌ ఐడీ 06027195. బ్యాంక్‌ అకౌంట్‌నంబరు 10731004862(ఎస్‌బీఐ). అనారోగ్యంతో తులశమ్మ కూడా 2016 డిసెంబరు 24à°¨ మరణించారు. అయితే ఆమె పింఛన్‌ కోసం à°ˆ విషయాన్ని కుటుంబసభ్యులు దాచిపెట్టారు. 2017 ఫిబ్రవరిలో ఆమె పేరిట లైఫ్‌ సర్టిఫికెట్‌ సంపాదించారు. దాన్ని పిడుగురాళ్లలోని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించడంతో ఇప్పటికీ ఆమె ఖాతాలో పింఛన్‌ జమవుతోంది. ఎప్పటికప్పుడు ఏటీఎం కార్డుతో à°† పింఛన్‌ను స్వాహా చేస్తున్నారు. నెలకు రూ.18,733 చొప్పున à°ˆ 14 నెలల్లో రూ.2.60 లక్షలకు పైగా ఆమె ఖాతాలో జమ అయ్యింది. 2017 ఆగస్టు 3à°¨ కూడా à°† అకౌంట్‌ నుంచి రూ.15వేలు డ్రా చేశారు. సాధారణంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే సమయంలో పెన్షనర్‌ ట్రెజరీకి రావాల్సి ఉంటుంది. ట్రెజరీ అధికారులు లైఫ్‌ సర్టిఫికెట్‌ను పరిశీలించడంతో పాటు, పెన్షనర్‌ వివరాలను సేకరిస్తారు.
 
మరణించిన తులశమ్మ లైఫ్‌ సర్టిఫికెట్‌ తీసుకొనే సమయంలో పిడుగురాళ్ల ట్రెజరీ అధికారులు ఏం చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. à°ˆ వ్యవహారంలో ట్రెజరీ అధికారుల హస్తంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం బయటకు పొక్కడంతో ట్రెజరీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తులశమ్మ బంధువులను హడావుడిగా కార్యాలయానికి పిలిపించి మంతనాలు జరిపారు. విషయం బయటకు రాకుండా చూసేందుకు ప్రలోభాలకు కూడా గురిచేసినట్టు సమాచారం.