నగరాల్లో తిష్టవేసిన దర్జా నకిలీ వ్యాపారం .

Published: Saturday March 17, 2018


కొద్ది నెలల క్రితం కిర్లంపూడి సమీపంలో వెన్నతీయని పాలు అని భ్రమింపజేసేందుకు అసలు వెన్నను తొలగించి, యూరియా, వంట నూనెను కలిపి నకిలీ వెన్నను తయారు చేస్తూ పాలలో కలిపి విక్రయాలు చేపట్టిన దారుణం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేశారు.

ఇటీవల రావులపాలెం మార్కెట్‌లో ఇథనాల్‌ వేసి ముగ్గించిన à°…à°°à°Ÿà°¿ పండ్లను ఆహార నియంత్రణాధికారులు, విజిలెన్స్‌ బృందం భారీగా గుర్తించారు. 350 గెలల à°…à°°à°Ÿà°¿ పండ్ల విక్రయాలను అడ్డుకున్నారు.

తమిళనాడు నుంచి జిల్లాకు వచ్చిన à°“ నకిలీ బెల్లం ముఠాను అధికారులు కాకినాడలో గుర్తించారు. ఫిబ్రవరిలో కాకినాడ ప్రతాప్‌ నగర్‌ సమీపంలో హానికర మోలాసిస్‌ కలిపి తయారు చేసిన నకిలీ తాటి బెల్లాన్ని రోడ్డు పక్కన à°“ వాహనంలో ఉంచి విక్రయిస్తుంటే అధికారులు గుర్తించి అక్కడికక్కడే పరీక్షించారు. నకిలీదని తేల్చారు.

పదార్థం: ఉప్పు 
కల్తీ పదార్థం: అయోడిన్‌ శాతాన్ని తగ్గించడం 
నష్టం: ఆర్థిక నష్టం, తగిన అయొడిన్‌ శరీరానికి అందక పోవడంతో ఆరోగ్య నష్టం 
గుర్తించడం: పల్చటి గుండ్రటి బంగాళదుంప పొర ఉపరితలంపై పరీక్షించవలసిన ఉప్పు పొడి(సాల్ట్‌)ని అద్దాలి. à°…à°° నిమిషం తర్వాత దానిపై à°“ చుక్క నిమ్మరసాన్ని వేయాలి. లేత నీలి రంగు కనపడితే అయొడిన్‌ ఉందని, కనిపించనట్లైతే అయొడిన్‌ లేదని గుర్తించాలి.

పదార్థం :   పచ్చిబఠాణి 
కల్తీ పదార్థం : మాలచైట్‌ పచ్చ రంగు 
నష్టం : క్యాన్సర్‌ కారకం 
గుర్తించడం : మార్కెట్‌లో దొరికే పచ్చి బఠాణీని నీటిలో నానబెట్టాలి. అనంతరం చేతితో గింజలను తడమాని బఠాణీని పచ్చగా చూపేందుకు కలిపిన హానికర రంగు గుట్టు బట్టబయలవుతుంది.

పదార్థం :  నూనెలు, కొవ్వు పదార్థాలు 
కల్తీ పదార్థం : ఆముదం 
నష్టం : ఆర్థిక నష్టం 
గుర్తించడం : à°“ పరీక్ష నాళికలో à°’à°• మి.లీ. నూనె లేదా కొవ్వు పదార్థాన్ని తీసుకుని పది మి.లీ.à°² ఆమ్ల పెట్రోలియం ఈథర్‌ను వేసి కలపాలి. à°† మిశ్రమానికి à°’à°• చుక్క గాఢ సల్ఫ్యూరిక్‌ ఆమ్లంతో తయారు చేసిన అమోనియం మోలిబ్డేట్‌ ద్రావణాన్ని కలపాలి. అలా చేసిన వెంటనే పరీక్ష నాళిక అడుగు భాగాన మబ్బు పొర ఏర్పడినట్లైతే నూనె లేదా కొవ్వు పదార్థం కల్తీగా గుర్తించాలి.

పదార్థం : తేనె 
కల్తీ పదార్థం : పంచదార, బెల్లం 
నష్టం : మధుమేహ బాధితులకు నష్టం, ఆర్థిక నష్టం 
గుర్తించడం : 5 మి.లీ తేనెకు 5 మి.లీ. ఈథర్‌ కలపాలి. à°ˆ ద్రావణాన్ని à°“ గాజు ప్లేటులో వేసి దానికి 2 నుంచి 3 మి.లీ.à°² రిసార్సినాల్‌ ద్రావణం, 5 మి.లీ.à°² హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం కలపాలి. గాజు ప్లేటులో ఎర్ర రంగు కనిపిస్తే తేనే పంచదార లేదా బెల్లంతో కల్తీ అయిందని గుర్తించాలి.

పదార్థం :  కందిపప్పు 
కల్తీ పదార్థం : కేసరి పప్పు(లంక పప్పు) 
నష్టం : పక్షవాతం 
గుర్తించడం : కొంచెం కందిపప్పును పరీక్ష నాళికలో వేసి సజల హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని వేసి, కలిపి, 15 నిమిషాలు ఉంచాలి. గులాబీ రంగు కనిపిస్తే కందిపప్పును కేసరి పప్పుతో కల్తీ చేసినట్లు నిర్ధారణ అయినట్లే.

పదార్థం :  కాఫీ పొడి 
కల్తీ పదార్థం : వేయించిన చికోరీలు, ఈతకాయల పొడి, చింతగింజల పొడి 
నష్టం : జీర్ణ సంబంధిత వ్యాధులు, ఆర్థిక నష్టం 
గుర్తించడం : కొంచెం కాఫీ పొడిని గ్లాసు నీళ్లలో కలపాలి. కాఫీ పొడి నీళ్లపై తేలి చికోరి గ్లాసు అడుగు భాగానికి చేరుతుంది. కాఫీ పొడిని వడపోత కాగితంపై వేసి à°’à°• శాతం సోడియం కార్బొనేట్‌ ద్రావణాన్ని చల్లాలి. కాగితంపై ఎరుపు రంగు కనిపిస్తే ఈతకాయలు, చింతకాయల పొడితో కల్తీ చేశారని నిర్థారించవచ్చు.

కల్తీకి పాల్పడితే ఉపేక్షించం 
లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలకు ముప్పు తేవద్దు. కల్తీని గుర్తించేందుకు విద్యార్థులు, గృహిణులను అప్రమత్తం చేయాలని నిర్ణయించాం. ఉన్నతాధికారుల అనుమతితో పలు అవగాహన కార్యక్రమాల రూపకల్పనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఆహార పదార్థాల కల్తీ ప్రాణాపాయానికి సైతం దారితీసిన ఉదంతాలు కోకొల్లలు. ఆహార పదార్థాల కల్తీకి పాల్పడితే ఉపేక్షించేది లేదు. కఠినంగా వ్యవహరిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుని సంస్థలను సీజ్‌ చేస్తాం. ప్రజలు ఆహార పదార్థాల కల్తీని గుర్తిస్తే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలి.


వి.నాగేశ్వరరావు, జిల్లా సహాయ ఆహార నియంత్రణాధికారి