శారదా పీఠం ఆధ్వర్యంలో చలి దుస్తులు, దుప్పట్లు పంపిణీ

Published: Tuesday July 09, 2019

గిరిజనులు భారతీయతకు మూలస్తంభాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. రుషికేష్‌, నీల్‌కంఠ్‌ ప్రాంతంలోని గిరిజనులకు పీఠం ఆధ్వర్యంలో సోమవారం చలి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పరిరక్షణ, వారిని చైతన్యపరిచి స్వధర్మ పరిరక్షణకు కార్యోన్ముఖులను చేయడం భారతావని కర్తవ్యమన్నారు. గిరివాసుల అభివృద్ధికి శారదాపీఠం ఎంతగానో కృషి చేసిందని స్వామీజీ వివరించారు. చాతుర్మాస దీక్ష ముందర రుషికేష్ లో గిరివాసులను ధార్మిక చైతన్యం కలిగిస్తున్నామన్నారు. à°ˆ నెల 16à°¨ చాతుర్మాస దీక్ష ప్రారంభించి సెప్టెంబరు 19à°¨ ముగించనున్నామని తెలిపారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా తనతో పాటు దీక్ష చేయనున్నారని స్వామీజీ పేర్కొన్నారు.