‘పవన’ ధరలు తగ్గించడం కుదరదు

Published: Wednesday July 10, 2019
పవన, సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సర్కారు ‘సమీక్ష’ మొదలైంది. ‘ధరలు తగ్గించుకుంటే సరి! లేదా... ఒప్పందాలు రద్దు చేసుకుంటాం’ అని ముందుగానే హెచ్చరించిన సర్కారు... వీరితో చర్చలకు à°’à°• ఉన్నత స్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. à°ˆ కమిటీతో భేటీకంటే ముందు ట్రాన్స్‌కో అధికారులు ఉత్పత్తిదారుల మనోగతం తెలుసుకునేందుకు... వారితో చర్చలు జరిపారు. పవన విద్యుత్‌ రంగంలో రాష్ట్రంలో యూనిట్లు నెలకొల్పిన బడా సంస్థల ప్రతినిధులు సుమారు పది మంది à°ˆ సమావేశానికి హాజరయ్యారు. పవన విద్యుత్‌ను à°’à°• యూనిట్‌ రూ. 4.84కు కొనేందుకు à°—à°¤ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి ఇచ్చింది. ‘‘గుజరాత్‌లో పవన్‌ విద్యుత్‌ ధర రూ.2.50 మాత్రమే. ఇక్కడ కూడా అదే ధరకు ఇవ్వండి’’ అని ట్రాన్స్‌కో అధికారులు కోరారు. దీంతో ఉత్పత్తిదారులు విభేదించారు. ‘గాలి వేగం, ఉత్పత్తిస్థాయి ఆధారంగా కేంద్ర ప్రభుత్వమే దేశాన్ని కొన్ని జోన్లుగా విభజించింది. ఏపీతో పోలిస్తే గుజరాత్‌లో గాలివేగం బాగా ఎక్కువ. అందువల్ల ఎక్కువ ఉత్పత్తి జరిగి, ఖర్చు తగ్గుతుంది. ఏపీలో గాలివేగం, ఉత్పత్తి à°† స్థాయిలో జరగదు. గుజరాత్‌తో పోలిక తేవడం సరికాదు. అక్కడి ధరకు ఇక్కడ ఇవ్వడం సాధ్యం కాదు’ అని ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు చెప్పారు.
 
 
ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్తు బాగా తక్కువ ధరకే అందుబాటులో ఉందని ట్రాన్స్‌ కో అధికారులు తెలిపారు. ‘సౌర, పవన విద్యుత్‌ కేంద్రాలు పూర్తిగా మూసివేసి బొగ్గుతో తయారైన కరెంటు కొనుక్కొంటే ఏడాదికి రూ.25వేల కోట్లు మిగులుతాయి. బయట తక్కువ ధరకు కరెంటు దొరుకుతుండగా.. మీ దగ్గర మేం ఎక్కువకు కొనుక్కోలేం. మీరూ, మేమూ ఇద్దరం నిలబడాలంటే ధరలు తగ్గించక తప్పదు’ అని ట్రాన్స్‌కో అధికారులు పవన్‌ విద్యుత్తు ఉత్పత్తిదారులకు స్పష్టం చేశారు. à°ˆ వాదనతో à°† సంస్థల ప్రతినిధులు విభేదించారు. ఇది కేవలం ఒక్క రాష్ట్రానికి, ఆర్థిక భారానికి సంబంధించిన విషయం కాదని తెలిపారు.
 
 
‘బొగ్గువల్ల కాలుష్యం పెరిగిపోతోంది. సంప్రదాయేతర విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తామని భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా అనేక ఒప్పందాలపై సంతకాలు చేసింది. à°† ప్రకారమే దేశంలో à°’à°• విధానం తెచ్చారు. అందులో భాగంగా మేం భారీగా పెట్టుబడులు పెట్టి నెలకొ ల్పాం. మీరు ఆమోదం తెలిపిన పీపీఏల ఆధారంగా మేం బ్యాంకుల నుంచి రు ణాలు తెచ్చుకొన్నాం. మా పెట్టుబడిలో 70% రుణాలు ఉన్నాయి. మీరు ధరలు తగ్గిస్తే రుణాలు చెల్లించలేం. అవి మునిగిపోతాయి. పీపీఏలు సవరించుకోవాలని ఒత్తిడి తెస్తే పారిశ్రామికరంగంలో చెడు సంకేతాలు వెళ్తాయి. ఒక్క విద్యుత్‌ రంగంలోనేకాక à°ˆ రాష్ట్రానికి మరే రంగంలోనూ పారిశ్రామికవేత్తలురారు. పెట్టుబడులు రిస్కులో పడతాయని వేరే రాష్ట్రాలకు వెళ్తారు. మొత్తం రాష్ట్రం నష్టపోతుంది’’ అని తెలిపారు.
 
దీంతోపాటు... తమకు అనేక రాష్ట్రాల్లో ఇవే తరహా యూనిట్లు ఉన్నామని, ఇక్కడ ధరలు తగ్గిస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే రకమైన ఒత్తిడి తెస్తాయని చెప్పారు. ‘‘దీనివల్ల మొత్తం దేశంలోనే à°ˆ రంగంలో ఇక ఎవరూ యూనిట్లు పెట్టరు. వీటన్నిటి నేపథ్యంలో ధరలు తగ్గించడం ఎంతమాత్రం కుదరదు’’ అని స్పష్టం చేశారు. పవన విద్యుదుత్పత్తిదారులు చెప్పిన అభ్యంతరాలకు తగిన సమాధానాలతో మరికొన్ని విడతలపాటు చర్చలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ‘‘వాళ్లు చెప్పేది వాళ్లు చెప్పారు. కానీ, మాకు ఖర్చు తగ్గాలి. వాళ్లపై ఒత్తిడి తెచ్చి ధరలు తగ్గించే మార్గాలు అన్వేషిస్తున్నాం’’ అని à°’à°• సీనియర్‌ అధికారి చెప్పారు.