తెలంగాణలో కోట్లు పెడితే నష్టపోయేది మనమే

Published: Friday July 12, 2019
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోలవరం ప్రాజెక్టుపై కోర్టుకెళ్లిన సంగతి గుర్తుంచుకోవాలని జలవనరుల à°°à°‚à°— విశ్లేషకుడు à°Ÿà°¿.లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. తెలంగాణలో మనం రూ.కోట్లు పెడితే భవిష్యత్‌లో నష్టపోయేది ఆంధ్రాయేనని స్పష్టం చేశారు. సాగర్‌, శ్రీశైలం జలాశయాలకు గోదావరి జలాల తరలింపుపై రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే సాగునీటి కోసం పక్క రాష్ట్రాల్లో వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను కృష్ణానదిలోకి తరలించడంపై పునరాలోచించాలన్నారు. ఏకపక్షంగా కాకుండా అందరితో చర్చించి వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా గోదావరి, కృష్ణానదుల అనుసంధానం జరిగినా అదిపూర్తిగా ఏపీ భూభాగం లోనే ఉండాలని స్పష్టంచేశారు. గురువారం కడపలో సీపీఐ ఆధ్వర్యంలో గోదావరి, కృష్ణా, పెన్నానదుల అనుసంధానంపై చర్చావేదిక నిర్వహించారు. 

 

వృథాగా సముద్రంపాలవుతున్న గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించి రెండు రాష్ట్రాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఇరువురు సీఎంలు ప్రకటించడం హర్షణీయమేనన్నారు. కానీ à°ˆ నిర్ణయంతో భవిష్యత్‌లో మన రాష్ట్రమే నష్టపోతుందన్న అనుమానాలున్నాయని తెలిపారు. కేసీఆర్‌ పోలవరం ప్రాజెక్టుపై వ్యవహరించిన తీరే ఇందుకు కారణమన్నారు. ‘పోలవరం ఎత్తు తగ్గించాలని, లేదంటే భద్రాచలం మునిగిపోతుందని సుప్రీంకోర్టులో ఆయన కేసు వేశారు. కేసీఆర్‌ తీరు నమ్మదగ్గది కాదు. పోలవరంపై ఎందుకు కేసు వేశారు? తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టులన్నీ కృష్ణా పరివాహక ప్రాం తంలో లేవని బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. కృష్ణా పరివాహక ప్రాంత పరిధిలోకి à°ˆ ప్రాజెక్టులు రాకుంటే రాయలసీమ ఎడారిగా మారుతుంది. ఇద్దరు సీఎంల మాటకు విశ్వసనీయత లేదు. తెలంగాణలో ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను మళ్లిస్తున్నారు. రెండు రాష్ట్రాలూ కొన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నా.. సాగర్‌, శ్రీశైలానికి గోదావరి జలాలను తరలించడం ఆచరణ సాధ్యం కాదన్నది నా భావన’ అని పేర్కొన్నారు. అందుకే రైతుసంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావులను అప్రమత్తం చేసేందుకు ప్రాంతాలవారీగా చర్చావేదికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదట విజయవాడలో నిర్వహించామని.. రెండోది కడపలో జరిపామని.. పలువురు మేధావులు, పార్టీల నుంచి మంచి స్పందనే వస్తోందన్నారు. à°† సందర్భాల్లో వ్యక్తమైన అభిప్రాయాలతో సీఎం జగన్‌కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు.