హామీలు ఆకాశంలో.. కేటాయింపులు పాతాళంలో..

Published: Saturday July 13, 2019
జగన్‌ ప్రభుత్వం నిధుల కోతతో అభివృద్ధికి గండికొట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలకు రూ.630 కోట్లు మాత్రమే చెల్లించారని శుక్రవారమే జగన్‌ విమర్శించారని.. కానీ తాజా బడ్జెట్‌లో సున్నా వడ్డీలకు రూ.4 వే à°² కోట్లు చెల్లించాల్సి ఉంటే.. రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని తప్పుబట్టారు. దీని పై రైతులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. à°ˆ బడ్జెట్‌లో రైతులకు అన్యాయం చేసి.. వచ్చే బడ్జెట్‌లో సరిచేస్తాననడం పలాయనవాదమన్నారు. బడ్జెట్‌పై చంద్రబాబు శుక్రవారం à°’à°• ప్రకటనలో స్పందించారు. బీసీ లు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నార నే అక్కసుతో వారి సంక్షేమ నిధుల్లో కోత విధించారని ఆరోపించారు. బడ్జెట్‌ ప్రగతికి, ప్రజల సంక్షేమానికి దోహదం చేసేలా లేదన్నా రు. వైసీపీ నేతల మాటలకు, చేతలకు పొం తన లేదనేందుకు à°ˆ బడ్జెట్టే ఉదాహరణగా పే ర్కొన్నారు. ‘ఏడాదిలోనే 80ు హామీలు అమలు చేస్తున్నామని డబ్బాలు కొడతారు. పథకాలు మాత్రం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటారు. కొన్ని పథకాలు దశలవారీగా, ఇం కొన్ని అంశాలు నాలుగేళ్లలో కొద్దికొద్దిగా à°…à°® లు చేస్తామంటారు.
 
ఇదేనా ఏడాదిలోనే 80 శాతం మేనిఫెస్టో హామీలు అమలుచేయడం’ అని నిలదీశారు. శీతల గిడ్డంగులు, గోదాంలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.200 కోట్లు, ఉచిత బోర్లకు రూ.200 కోట్లు, పశు బీమాకు రూ.50 కోట్ల అరకొర కేటాయింపులు చేసి, రైతుల ఆదాయాన్ని నాలుగేళ్లలో ఎలా రెట్టింపు చేస్తారని ప్రశ్నించారు. కరువుపై శాసనసభలో జరిగిన చర్చలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ముఖ్యమంత్రి.. బడ్జెట్‌లో తాగునీటికి, పారిశుధ్యానికి గతం కంటే 15శాతం తక్కువగా కేటాయించారన్నారు. ఆయన ఇచ్చిన హామీలు ఆకాశంలో ఉంటే.. కేటాయింపులు పాతాళంలో ఉన్నాయని చెప్పారు.