కర్ణాటకలో జగన్‌ కంపెనీ ధరలు తగ్గించుకోవచ్చు కదా

Published: Thursday July 18, 2019
 à°¸à±Œà°°, పవన విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలలో (పీపీఏ) అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ అధికారపక్షం చేసిన ఆరోపణలను టీడీపీ అధ్యక్షుడు, విపక్షనేత చంద్రబాబు ఖండించారు. బుధవారం ఆయన గుంటూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘నేను ఒకేఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ధరలు ఖరారు చేసింది మేమా? రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన పనిచేసే విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషనా? ఈఆర్‌సీ బహిరంగ విచారణ జరిపి మరీ à°ˆ ధరలను ఖరారు చేస్తుంది. దేశమంతా ఇదే విధానం అమల్లో ఉంది. ధరల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్రే లేదు. అయినా వైసీపీ నేతలు బురద చల్లుడు రాజకీయం చేస్తున్నారు’’ అని తెలిపారు. అధికారులతో విలేకరుల సమావేశాలు పెట్టించి ఇన్ని అబద్ధాలు చెప్పించడం మొదటిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆయా అంశాలపై చంద్రబాబు స్పందన ఆయన మాటల్లోనే...
 
హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యుడీషియల్‌ కమిషన్‌ వేస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఇటువంటి కమిషన్లకు సిటింగ్‌ న్యాయమూర్తులను కేటాయించరు. రిటైర్డ్‌ జడ్జిలనే తీసుకోవాలి. ఈఆర్‌సీకి కూడా రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యం వహిస్తున్నారు. à°ˆ కమిషన్‌ కూడా à°’à°• తరహా న్యాయస్థానం వంటిదే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శక సూత్రాలను పరిగణనలోకి తీసుకొని బహిరంగ విచారణలు జరిపి ఏ ధరకు ఏ విద్యుత్‌ కొనాలో నిర్ణయిస్తుంది. à°† ప్రకారం పీపీఏలు కుదురుతాయి. వాటిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే కోర్టుకు కూడా వెళ్లవచ్చు. ఇంత స్పష్టంగా à°ˆ విధి విధానాలు ఉంటే పీపీఏల్లో ధర విషయంలో మాపై ఎలా ఆరోపణలు చేస్తారు?